News July 13, 2024
2026 ఫిఫా వరల్డ్ కప్ విశేషాలు ఇవే

ఫిఫా వరల్డ్ కప్ 2026 అమెరికా, కెనడా, మెక్సికోలో జరగనుంది. ఈ టోర్నీ 6 వారాలపాటు కొనసాగనుంది. 48 దేశాలు ట్రోఫీ కోసం పోటీపడతాయి. మొత్తం 104 మ్యాచ్లు ఉండగా, జట్లను 12 గ్రూపులుగా విభజించారు. ప్రతి రోజూ 6 గేమ్స్ జరుగుతాయి. 3 దేశాల్లోని 26 స్టేడియాల్లో మ్యాచులు కొనసాగుతాయి. మెక్సికోలోని ఇస్తాడియో అజ్టెకా స్టేడియంలో ఆరంభ వేడుకలు నిర్వహిస్తారు. ఫైనల్ మ్యాచ్ న్యూయార్క్ జెర్సీ స్టేడియంలో జరగనుంది.
Similar News
News November 4, 2025
గర్భనిరోధక మాత్రలతో స్ట్రోక్ ముప్పు

అవాంఛిత గర్భాన్ని నిరోధించేందుకు చాలామంది మహిళలు గర్భనిరోధక మాత్రలు వాడుతుంటారు. ఈస్ట్రోజెన్, ప్రొజెస్టిరాన్ హార్మోన్లు ఉన్న గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలకు క్రిప్టోజెనిక్ స్ట్రోక్ ముప్పు ఎక్కువని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు రక్తసరఫరా జరిగే మార్గంలో రక్తం గడ్డకట్టి ఈ స్ట్రోక్ వస్తుంది. మహిళలకు వస్తున్న స్ట్రోక్లలో దాదాపు 40% దాకా క్రిప్టోజెనిక్ ఐషెమిక్ స్ట్రోక్లేనని తెలిపారు.
News November 4, 2025
ఫైనల్కు ముందు కౌర్ బామ్మకు హార్ట్ఎటాక్.. విషయం దాచి!

ఉమెన్స్ WC ఫైనల్కు ముందు IND ప్లేయర్ అమన్జోత్ కౌర్ మానసిక స్థైర్యం దెబ్బతినకుండా ఆమె కుటుంబం కఠిన నిర్ణయం తీసుకుంది. బామ్మకు హార్ట్ఎటాక్ వచ్చిన విషయాన్ని మ్యాచ్ ముగిసేవరకు కౌర్కు తెలియకుండా దాచింది. విజయం తర్వాత విషయం తెలుసుకుని ఆమె బాధతో కుంగిపోయారు. కాన్సంట్రేషన్ దెబ్బతినొద్దని ఆమెకు ఈ విషయాన్ని చెప్పలేదని కుటుంబం తెలిపింది. కూతురి కోసం గుండెనిబ్బరం చూపిన కుటుంబంపై ప్రశంసలొస్తున్నాయి.
News November 4, 2025
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో ఉద్యోగాలు

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(<


