News January 3, 2025

X త్వ‌ర‌లో అందించనున్న ఫీచ‌ర్లు ఇవే..

image

మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫాం X రానున్న రోజుల్లో ఊహించ‌ని రీతిలో యూజ‌ర్ల‌తో కనెక్ట్ అవుతుందని కంపెనీ మేనేజ్‌మెంట్ తెలిపింది. X టీవీ, X మనీతో పాటు X AI చాట్‌బోట్‌ గ్రోక్‌ను మరింత మెరుగ్గా అందరికీ అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. Xను Everything APPగా మార్చాల‌న్నదే ఎలాన్ మ‌స్క్ వ్యూహ‌మ‌ని సంస్థ పేర్కొంది. Xలో మార్పులకు చైనాకు చెందిన Wechat బ్లూప్రింట్‌ అని పలు సందర్భాల్లో మస్క్ తెలిపారు.

Similar News

News November 17, 2025

గంజాయి టెస్ట్.. స్పాట్‌లోనే రిజల్ట్స్!

image

TG: గంజాయిని శాశ్వతంగా అరికట్టడానికి పోలీస్ శాఖ నయా టెక్నాలజీని ప్రవేశపెట్టింది. అనుమానం ఉన్నవారిని ‘యూరిన్ టెస్ట్ కిట్‌’తో టెస్ట్ చేసి స్పాట్‌లోనే ఫలితాన్ని నిర్ధారిస్తారు. సైబరాబాద్, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్, సిద్దిపేట కమిషనరేట్ల పరిధిలోని కొన్ని పోలీస్ స్టేషన్లను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయా పీఎస్‌లకు యూరిన్ కిట్లను పంపిణీ చేసినట్లు సమాచారం.

రేపు భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ప్రకాశం, అనంతపురం, అన్నమయ్య, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. అటు రాష్ట్రంలో చలి తీవ్రరూపం దాల్చింది. సా.6 తర్వాత బయటికి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు.