News December 24, 2024
చలికాలంలో బరువు తగ్గించే ఫుడ్స్ ఇవే..
ఫైబర్ ఎక్కువగా ఉండే స్వీట్ పొటాటో తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది. స్నాక్స్ తినాల్సిన అవసరం ఉండదు. క్యారెట్లో క్యాలరీలు తక్కువ, పీచు ఎక్కువ. దీంతో బరువు, BMI, కొవ్వును తగ్గించుకోవచ్చు. నిత్యం మన డైట్ మెనూలో ఆకుకూరలు ఉండాల్సిందే. వీటిలోని నీరు, విటమిన్లు, మినరల్స్ ఆకలిని సంతృప్తి పరిచి జీర్ణశక్తిని పెంచుతాయి. బీట్‌రూట్‌లో నీరు, ఫైబర్, ప్రొటీన్ ఉంటాయి. కాజు, బాదం, అవిసెలకు ప్రాధాన్యం తప్పనిసరి.
Similar News
News December 25, 2024
ఆహార కల్తీ సీరియస్ ఇష్యూ: నాదెండ్ల
AP: వినియోగదారుల చట్టాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. అప్పుడే అమ్మకందారుల్లో బాధ్యత పెరుగుతుందన్నారు. తూనికలు, కొలతల శాఖ మరింత పటిష్ఠం కావాల్సి ఉందని, ఆకస్మిక తనిఖీలను పెంచాలని అధికారులను ఆదేశించారు. ఆహార కల్తీ అనేది సీరియస్ విషయంగా గుర్తించామని, ప్రతి జిల్లాలో ఓ ల్యాబ్ ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబును కోరతానని తెలిపారు.
News December 25, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News December 25, 2024
ఈ రోజు నమాజ్ వేళలు
✒ తేది: డిసెంబర్ 25, బుధవారం
✒ ఫజర్: తెల్లవారుజామున 5.26 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.43 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.16 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.13 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.49 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.