News December 20, 2024

2024లో భారత్ సాధించిన గొప్ప విజయాలివే!

image

ఇండియా సాధించిన అతిపెద్ద విజయాలను పారిశ్రామికవేత్త హర్షా గోయెంకా Xలో రాసుకొచ్చారు. అందులో చంద్రయాన్-3ని మన దేశం సాధించిన గొప్ప విజయంగా చెప్పుకొచ్చారు. దీని తర్వాత ప్రపంచంలో 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం, G20 నాయకత్వం, డిజిటల్ ఇండియా పెరగడం, 110 యునికార్న్‌లకు పైగా అభివృద్ధి, మహిళా రిజర్వేషన్ బిల్లు, ప్రపంచ కప్ విజయం, గ్రీన్ ఎనర్జీ వినియోగం పెరగడం అని తెలిపారు.

Similar News

News February 3, 2026

USతో ట్రేడ్ డీల్ వివరాలు బయటపెట్టాలి: INC

image

IND-US ట్రేడ్ డీల్ గురించి ట్రంపే ప్రకటన చేశారని ప్రధాని మోదీ కాదని కాంగ్రెస్ పేర్కొంది. మోదీ అభ్యర్థన మేరకే ఈ ఒప్పందం జరిగిందని, డీల్‌లోని వివరాలు వెల్లడించాలని Xలో డిమాండ్ చేసింది. ‘పార్లమెంటును, దేశాన్ని విశ్వాసంలోకి తీసుకోవాలి. ఒప్పందంలోని కీలకాంశాలు తెలపాలి. యుద్ధ విరమణ ఒప్పందం లాగే, వాణిజ్య ఒప్పంద ప్రకటననూ ట్రంపే చేశారు. మోదీ అభ్యర్థన మేరకే వాణిజ్య ఒప్పందం జరుగుతోంది’ అని పేర్కొంది.

News February 3, 2026

దేశ భద్రత గురించే నేను మాట్లాడుతున్నా: రాహుల్ గాంధీ

image

చైనాతో సరిహద్దు వివాదంపై నిన్న పార్లమెంటులో చేసిన ఆరోపణలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సమర్థించుకున్నారు. ఈరోజు పార్లమెంటు సమావేశాల్లో మరోసారి ఈ విషయాన్ని ప్రస్తావించారు. దేశ భద్రత గురించే తాను మాట్లాడుతున్నానని.. నిన్న సభలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కాగా రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు అభ్యంతరం తెలిపారు.

News February 3, 2026

కల్తీ నెయ్యి కేసు.. విచారణ కమిషన్‌కు మంత్రివర్గం నిర్ణయం

image

AP: కల్తీ నెయ్యి కేసులో సిట్ నివేదికపై క్యాబినెట్‌లో చర్చించారు. సిట్ కేవలం పాత్రధారులపైనే సిఫార్సు చేసిందని మంత్రులు అభిప్రాయపడ్డారు. విచారణ, ఛార్జ్‌షీట్, ప్రభుత్వానికి సమర్పించిన నివేదికల్లో తేడాలు ఉన్నాయన్నారు. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు అడ్వకేట్ జనరల్‌ను న్యాయ సలహా కోరారు. ఆయన సూచన మేరకు ఈ అంశంలో ముందుకెళ్లే అవకాశం ఉంది.