News May 20, 2024
విమాన ప్రమాదాల్లో చనిపోయిన దేశాధినేతలు వీరే..

హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ <<13279352>>దుర్మరణం<<>> పాలయ్యారు. గతంలోనూ పలువురు దేశాధినేతలు ఇలాంటి ఘటనల్లో మరణించారు. 1936-స్వీడన్ PM లిండ్మాన్, 1957- ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రామన్ మెగసెసే, 1958-బ్రెజిల్ ప్రెసిడెంట్ నెరేయు, 1966-ఇరాక్ అధ్యక్షుడు ఆరిఫ్, 1967-బ్రెజిల్ ప్రెసిడెంట్ బ్రాంకో, 1987-లెబనాన్ PM రషీద్, 1988-పాక్ ప్రెసిడెంట్ జియా ఉల్ హక్ కన్నుమూశారు.
Similar News
News November 23, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం

బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లుగా కలెక్టర్ వినోద్ కుమార్ ఆదివారం తెలిపారు. ముందుగా ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు సమీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. అనంతరం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజల నుంచి సమస్యల అర్జీలను స్వీకరించడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
News November 23, 2025
APPLY NOW: జిప్మర్లో ఉద్యోగాలు

జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(JIPMER) 9 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 5వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో MD, DM, MS, DNB, M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్సైట్: https://jipmer.edu.in/
News November 23, 2025
ఓవైపు CBN, రేవంత్.. మరోవైపు జగన్, KTR

తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో రెండు కీలక దృశ్యాలు చర్చనీయాంశంగా మారాయి. పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి శతజయంతి ఉత్సవాల్లో AP CM చంద్రబాబు, TG CM రేవంత్ ఒకే వేదికను పంచుకున్నారు. అదే సమయంలో బెంగళూరులో జరిగిన ఓ ఈవెంట్కు AP మాజీ CM వైఎస్ జగన్, తెలంగాణ మాజీ మంత్రి KTR కలిసి హాజరయ్యారు. త్వరలో రెండు రాష్ట్రాల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు రాజకీయ వర్గాల్లో కీలక చర్చకు దారి తీశాయి.


