News February 10, 2025
అత్యధిక ఫాలోవర్లున్న ఇన్‌స్టా అకౌంట్స్ ఇవే

ఇన్‌స్టాగ్రామ్-685 మిలియన్లు
క్రిస్టియానో రొనాల్డో – 649 మిలియన్లు
లియోనెల్ మెస్సీ – 505 మిలియన్లు
సెలీనా గోమెజ్- 422 మిలియన్లు
డ్వేన్ జాన్సన్ (రాక్) – 395 మిలియన్లు
కైలీ జెన్నర్ – 394 మిలియన్లు
అరియానా గ్రాండే – 376 మిలియన్లు
*ఇండియాలో విరాట్ కోహ్లీ (270 మిలియన్లు) అత్యధిక ఫాలోవర్లు కలిగి ఉన్నారు.
Similar News
News March 7, 2026
ఇకపై రైతుల అకౌంట్లకే సబ్సిడీ నిధులు: తుమ్మల

TG: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో రైతులు కొనుగోలు చేసిన పనిముట్లకు 40% సబ్సిడీని ప్రభుత్వం కంపెనీలకు అందిస్తోంది. ఇకపై అన్నదాతల ఖాతాలకే ఆ డబ్బులు జమ చేసేలా చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. APR నెలాఖరులోగా పచ్చిరొట్ట విత్తనాలను సిద్ధం చేయాలని సూచించారు. ఖరీఫ్ కోసం ముందుగానే ఎరువులను తెప్పించాలన్నారు. ఈసారి 60.60L హెక్టార్లలో సాగయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
News March 7, 2026
రాజమండ్రి కల్తీ పాలు.. మిస్టరీ వీడింది

AP: రాజమండ్రిలో కల్తీ పాల ఘటనకు కారణాలను అధికారులు వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం <<19223408>>ఇథిలీన్ గ్లైకాల్<<>> అనే విషపూరిత కెమికల్ పాలలో కలిసినట్లు తెలిపారు. వీటిని తాగడం వల్ల కిడ్నీలు దెబ్బతిని పలువురు <<19320294>>మరణించినట్లు<<>> వివరించారు. కాగా గత నెలలో పాలను నిల్వ చేసే ఫ్రీజర్ చెడిపోవడంతో అందులోని కూలెంట్ లీకయ్యింది. పాలు చేదుగా ఉన్నాయని పలువురు ఫిర్యాదు చేసినా వ్యాపారి గణేశ్ నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
News March 7, 2026
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. 9 నుంచి అగ్నివీర్ రిక్రూట్‌మెంట్

తెలుగు రాష్ట్రాల నిరుద్యోగుల కోసం ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిస్తోంది. మార్చి 9 నుంచి గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో సెలక్షన్స్ ప్రారంభమవుతాయి. 9, 10 తేదీల్లో మహిళలకు, 12 నుంచి 16 వరకు పురుష అభ్యర్థులకు ర్యాలీ జరుగుతుంది. 2005 జులై 2 నుంచి 2009 జనవరి 2 మధ్య జన్మించిన అవివాహిత అభ్యర్థులు దీనికి అర్హులు. ఇంటర్ లేదా డిప్లొమాలో 50% మార్కులు ఉండాలి.


