News September 21, 2025

అర్ధరాత్రి నుంచి ధరలు తగ్గే వస్తువులు ఇవే..

image

దేశవ్యాప్తంగా ఈ అర్ధరాత్రి నుంచి కొత్త జీఎస్టీ రేట్లు అమల్లోకి రానున్నాయి. ఇక నుంచి 5%, 18% శ్లాబులు మాత్రమే ఉంటాయి. కొన్నింటిని 40% ట్యాక్స్ లిస్టులో చేర్చారు. దాదాపు 200కు పైగా వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఆహారం, పాల ఉత్పత్తులు, FMCG, ఎలక్ట్రానిక్స్, వాహనాల ధరలు పడిపోనున్నాయి. ఏయే వస్తువుల ధరలు తగ్గుతాయో ఏపీ ప్రభుత్వం ఒక జీవో విడుదల చేసింది. ఇక్కడ <>క్లిక్<<>> చేసి తెలుగులో తెలుసుకోవచ్చు.

Similar News

News September 21, 2025

సంతానోత్పత్తిని పెంచే సీడ్ సైక్లింగ్‌

image

మహిళల సంతానోత్పత్తిలో హార్మోన్లు కీలకపాత్ర పోషిస్తాయి. వీటిని సమతుల్యంగా ఉంచడానికి సీడ్ సైక్లింగ్ ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. సీడ్ సైక్లింగ్ అనేది అవిసె, గుమ్మడి, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి విత్తనాలను ఒక ప్రత్యేక విధానంలో తినే ఒక ప్రకృతి వైద్య చికిత్స. ఇది PMS లక్షణాలను తగ్గించడానికి, ప్రత్యుత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. వీటిని సలాడ్లు, స్మూతీల్లో వేసుకొని తినొచ్చు.

News September 21, 2025

సీడ్ సైక్లింగ్‌ ఎలా చేయాలంటే?

image

సీడ్ సైక్లింగ్‌లో పీరియడ్ 1-14 రోజు వరకు రోజుకు అవిసె, గుమ్మడికాయ విత్తనాలను తీసుకోవాలి. 14వరోజు నుంచి పీరియడ్స్ మొదటి రోజు వరకు పొద్దుతిరుగుడు, నువ్వుల గింజలను తీసుకోవాలి. రెగ్యులర్ పీరియడ్‌‌లో మొదటి 14 రోజులు ఫోలిక్యులర్ దశ, తర్వాత లూటియల్ దశ ఉంటాయి. ఆ సమయానికి తగ్గట్లు సీడ్స్ తీసుకోవడం వల్ల ప్రొజెస్టెరాన్, ఈస్ట్రోజెన్ హార్మోన్ల స్థాయిలు సమతుల్యతతో ఉంటాయి. ఇవి గర్భం దాల్చడంలో సహాయపడతాయి.

News September 21, 2025

గ్రూప్-2 సర్టిఫికెట్ వెరిఫికేషన్ తేదీల ప్రకటన

image

TG: గ్రూప్‌-2 పోస్టులకు నాలుగో విడత సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌ తేదీలను TGPSC ప్రకటించింది. ఈ ప్రక్రియ ఈ నెల 23 నుంచి 25 వరకు ఉ.10:30గంటల నుంచి సా.5గంటల వరకు నాంపల్లి తెలుగు వర్సిటీలో జరగనుంది. 783 పోస్టులకు తొలి విడతలో 775, రెండో విడతలో 294, మూడో విడతలో 119, ఈసారి 193 మందిని పిలిచారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను <>https://www.tgpsc.gov.in<<>>లో అందుబాటులో ఉంచినట్టు TGPSC తెలిపింది.