News March 29, 2024
బీఆర్ఎస్‌కు షాకిచ్చిన నేతలు వీరే..

TG: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్‌ను వీడుతున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. పార్టీని వీడిన ప్రముఖ నేతల్లో ఎంపీ రంజిత్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డి, దానం నాగేందర్(కాంగ్రెస్), బీబీపాటిల్, పి.రాములు, జి.నగేశ్, ఆజ్మీరా సీతారాం నాయక్, జలగం వెంకట్రావు, సైదిరెడ్డి, ఆరూరి రమేశ్(బీజేపీ) ఉన్నారు. వీరిలో చాలామంది లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్లు దక్కించుకోవడం గమనార్హం.
Similar News
News November 27, 2025
పల్నాడు: అంబటి చూపు ఎటువైపు..?

వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి అంబటి రాంబాబు రానున్న ఎన్నికల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనేది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేపల్లె, సత్తెనపల్లి నుంచి మూడుసార్లు పోటీ చేసి ఒక్కసారి గెలిచారు. మాజీ సీఎంలు వైఎస్సార్, జగన్కు సన్నిహితుడైన ఆయన ప్రస్తుతం వైసీపీ గుంటూరు వెస్ట్ ఇన్ఛార్జ్గా ఉన్నారు.
News November 27, 2025
8,868 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

రైల్వేలో 8,868 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ అర్హతతో 5,810 పోస్టులు, ఇంటర్ అర్హతతో 3,058 పోస్టులు ఉన్నాయి. CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-33ఏళ్లు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-30ఏళ్లవారు అర్హులు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 27, 2025
APPLY NOW: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2700 పోస్టులు

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో డిగ్రీ అర్హతతో 2,700 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం అప్రెంటిస్లలో TGలో 154, APలో 38 ఉన్నాయి. వయసు 20-28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్లో సడలింపు ఉంది. NATS/ NAPS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్లైన్ ఎగ్జామ్, DV, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.15,000 చెల్లిస్తారు.


