News January 31, 2025

ప్రపంచంలో అందమైన దేశాలు ఇవే

image

వరల్డ్‌లో అనేక అందమైన దేశాలు ఉన్నాయి. వీటిని చూడటానికి ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు వెళ్తుంటారు. ఓ నివేదిక ప్రకారం న్యూజిలాండ్ ప్రపంచంలోనే అందమైన దేశంగా నిలిచింది. ప్రకృతి అందాలు ఆస్వాదించాలంటే న్యూజిలాండ్ అనువైన ప్రదేశం. టాప్-15 దేశాలు: న్యూజిలాండ్, ఇటలీ, కెనడా, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, యూకే, నార్వే, ఆస్ట్రేలియా, గ్రీస్, సౌతాఫ్రికా, అమెరికా, చిలీ, ఐస్‌లాండ్, అర్జెంటీనా, క్రొయేషియా.

Similar News

News January 26, 2026

బ్రాకీథెరపీ.. క్యాన్సర్ చికిత్సలో నోరి దత్తాత్రేయుడి అద్భుతం

image

క్యాన్సర్ వైద్యంలో విప్లవం సృష్టించిన తెలుగు డాక్టర్ నోరి దత్తాత్రేయుడిని కేంద్రం పద్మభూషణ్‌తో సత్కరించింది. ఆయన అభివృద్ధి చేసిన ‘హై డోస్ రేట్ బ్రాకీథెరపీ’ విధానం ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కాపాడుతోంది. ఆరోగ్యకరమైన కణాలకు హాని చేయకుండా నేరుగా క్యాన్సర్ కణితిపైనే రేడియేషన్ వేయడం దీని ప్రత్యేకత. ముఖ్యంగా గర్భాశయ, ఊపిరితిత్తులు, మెడ భాగాల్లో వచ్చే క్యాన్సర్లకు ఈ చికిత్స వరంగా మారింది.

News January 26, 2026

వేసవి ఉల్లి సాగుకు సూచనలు

image

వేసవి పంట కోసం ఉల్లిని సాగు చేయాలనుకుంటే ఈ నెలలోనే సిద్ధమవ్వాలి. పంట కొరకు ముందుగా నారును పెంచుకోవాలి. నారుమడి కోసం నేలను దున్ని 4 మీటర్ల పొడవు, 1 మీటరు వెడల్పు, 15 సెంటీ మీటర్ల ఎత్తు గల 10 మళ్లను తయారు చేసుకోవాలి. ఒక కిలో విత్తనానికి కాప్టాన్ లేదా థైరమ్‌ను 3గ్రా. లేదా ట్రైకోడెర్మావిరిడె 4 గ్రాములు పట్టించి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.

News January 26, 2026

భారతీయత ఉట్టిపడేలా ఉర్సులా జాకెట్

image

భారత సంప్రదాయం ఉట్టిపడేలా యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయెన్ రిపబ్లిక్ డే వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సాధారణంగా ప్యాంటుసూట్స్‌లో కనిపించే ఆమె తాజాగా బనారసీ జాకెట్‌ను ధరించారు. గోల్డ్, మెరూన్ రంగులో ఉన్న ఈ దుస్తులు ఆకట్టుకుంటున్నాయి. 77వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఉర్సులా హాజరయ్యారు. ఈ వేడుకల్లో పాల్గొనడం తన జీవితంలో లభించిన అతిపెద్ద గౌరవం అని ట్వీట్ చేశారు.