News December 22, 2024
ఇవి అత్యంత ఖరీదైన చీరలు
చీరలు స్త్రీల అందాన్ని మరింత ఇనుమడింపచేస్తుంటాయి. అందుకే భారత మహిళలు చీర కట్టును ఇష్టపడుతుంటారు. చీరల్లో లెక్కలేనన్ని రకాలున్నా వాటిలో అత్యంత ఖరీదైనవి మాత్రం కొన్నేే. అవి.. మూంగా పట్టుచీర: ధర రూ.2 లక్షల వరకు ఉంటుంది. పటాన్ పటోలా చీర: రూ.లక్ష వరకూ ఉంటుంది. కడ్వా కట్‌వర్క్ చీర: రూ.5 లక్షల వరకూ ధర ఉంటుంది. కాంచీపురం పట్టుచీర: ధర రూ.5 లక్షల వరకూ ఉంటుంది. బనారస్ పట్టుచీర: రూ.5 లక్షల వరకూ ఉంటుంది.
Similar News
News December 22, 2024
రాహుల్ గాంధీకి యూపీ కోర్టు నోటీసులు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి UPలోని ఓ కోర్టు నోటీసులిచ్చింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ కులగణనపై మాట్లాడుతూ జనాభా ప్రాతిపదికన దేశ సంపదను పంచుతామని అన్నారు. ఆ వ్యాఖ్యలు దేశాన్ని విడదీసేలా ఉన్నాయంటూ పంకజ్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన కోర్టు, వచ్చే నెల 7న విచారణకు హాజరుకావాలని రాహుల్‌ను ఆదేశించింది.
News December 22, 2024
రాష్ట్రంలో తప్పిన పెను రైలు ప్రమాదం
AP: విశాఖ రైల్వే స్టేషన్ వద్ద పెను ప్రమాదం తప్పింది. TN నుంచి బెంగాల్ వెళ్తున్న సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ తె.జామున విశాఖ స్టేషన్‌కు చేరుకుంది. అక్కడ తొలగించిన ఇంజిన్ ముందుకు వెళ్తూ పైనున్న విద్యుత్ తీగలను ఈడ్చుకెళ్లింది. సిబ్బంది వెంటనే విద్యుత్‌ను నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సిబ్బంది విద్యుత్‌ను పునరుద్ధరించి రాకపోకలను తిరిగి ప్రారంభించారు.
News December 22, 2024
అతడు ఒంటిచేత్తో సిరీస్‌ను కాపాడాడు: రవి శాస్త్రి
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో భారత్ ఆశలు సజీవంగా ఉండటానికి జస్ప్రీత్ బుమ్రా అనే ఒకే ఒక్క ఆటగాడు కారణమని మాజీ క్రికెటర్ రవిశాస్త్రి పేర్కొన్నారు. ‘బుమ్రా ఒంటి చేత్తో సిరీస్ చేజారకుండా ఆపారు. మిగిలిన స్టార్లు కూడా మేల్కొంటే ఆస్ట్రేలియా పని అయిపోయినట్లే. బాక్సింగ్ డే టెస్టులో మనోళ్లు చెలరేగుతారనుకుంటున్నాను’ అని పేర్కొన్నారు. 3 మ్యాచుల్లో బుమ్రా 21 వికెట్లు తీయడం విశేషం.