News April 13, 2025
ప్రపంచంలో మోస్ట్ పాపులర్ స్పోర్ట్స్ ఇవే

ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ గేమ్‌గా ఫుట్‌బాల్ నిలిచింది. 3.5 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో సాకర్ మొదటిస్థానంలో కొనసాగుతోంది. 2.5 బిలియన్ డాలర్ల బ్రాండ్ వ్యాల్యూతో క్రికెట్ రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత హాకీ (2 బిలియన్), టెన్నిస్ (1 బిలియన్), వాలీబాల్ (900 మిలియన్) టాప్-5లో నిలిచాయి. టేబుల్ టెన్నిస్, బాస్కెట్ బాల్, బేస్ బాల్, రగ్బీ, గోల్ఫ్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి.
Similar News
News April 13, 2025
పరస్పర సుంకాలను రద్దు చేయండి: చైనా

పరస్పర సుంకాలను పూర్తిగా రద్దు చేయాలని అమెరికాను చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరింది. ట్రంప్ తాను చేసిన తప్పును సరిదిద్దుకోవాలని సూచించింది. ఫోన్లు, కంప్యూటర్లు, చిప్‌లను టారిఫ్స్ నుంచి మినహాయిస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం చాలా చిన్నది అని తెలిపింది. తమ దేశంపై 145% సుంకం విధించడాన్ని తప్పుబట్టింది. ‘పులి మెడలోని గంటను దానిని కట్టిన వ్యక్తి మాత్రమే విప్పగలడు’ అని పేర్కొంది.
News April 13, 2025
వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీంకోర్టులో విజయ్ పిటిషన్

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా తమిళ సినీ నటుడు, TVK పార్టీ అధినేత విజయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ చట్టం ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం అని, దీనిని వెనక్కి తీసుకోవాలని ఆయన ఇప్పటికే డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ చట్టానికి రాజ్యాంగబద్ధతను సవాల్ చేస్తూ ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 10 పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిపై ఈనెల 16న ధర్మాసనం విచారణ చేపట్టనుంది.
News April 13, 2025
క్షమాపణలు చెప్పను: రాకేశ్ రెడ్డి

TGPSC తనకు పరువునష్టం నోటీసులు <<16075233>>పంపడంపై <<>>BRS నేత రాకేశ్ రెడ్డి స్పందించారు. ‘పూర్తి ఆధారాలతో గ్రూప్-1 అవకతవకలు బయటపెట్టాం. వాటికి TGPSC సమాధానం చెప్పట్లేదు. కమిషన్ ఇలా పరువునష్టం నోటీసులు ఇవ్వడం దేశంలోనే ప్రథమం. నోటీసులు ఇచ్చినా నేను క్షమాపణలు చెప్పను. న్యాయవిచారణ జరిపిస్తే ఆధారాలు చూపిస్తాం. నేనే TGPSCపై పరువునష్టం దావా వేయబోతున్నా. అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం’ అని స్పష్టం చేశారు.