News July 8, 2024
ఎక్కువ మంది చూసిన వెబ్‌సైట్స్ ఇవే!

జూన్ నెలలో అత్యధిక మంది సందర్శించిన వెబ్‌సైట్స్ జాబితాను ‘SimilarWeb’ ప్రకటించింది. అందులో google. com మొదటి స్థానంలో ఉండగా youtube. com రెండో ప్లేస్‌లో ఉంది. తర్వాతి స్థానాల్లో facebook.com, xhamster.desi, instagram.com, aajtak.com, pm-bet.in, samsung.com, x.com, xhamster.com, whatsapp.com ఉన్నాయి. మీరు ఎక్కువగా ఏ వెబ్‌సైట్ వాడుతారో కామెంట్ చేయండి.
Similar News
News December 20, 2025
మలయాళ నటుడు శ్రీనివాసన్ మృతి

ప్రముఖ మలయాళ నటుడు, దర్శకుడు, స్క్రీన్‌ప్లే రైటర్ శ్రీనివాసన్(69) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఎర్నాకుళంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కన్నూరు జిల్లాలోని పట్టియంలో 1956లో జన్మించిన శ్రీనివాసన్ 48 ఏళ్ల సినీ కెరీర్‌లో కామెడీ పాత్రలతో అలరించారు. సందేశాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించి ఆలోచింపజేశారు. శ్రీనివాసన్ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలు సంతాపం తెలిపారు.
News December 20, 2025
IRCTC వాలెట్‌తో బోలెడు ప్రయోజనాలు

IRCTC E-వాలెట్‌లో జమ చేసిన డబ్బులను నేరుగా విత్‌డ్రా చేసుకునే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీనివలన ప్రయాణికులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. తత్కాల్ టికెట్లు కేవలం సెకన్లలోనే బుక్ అవుతాయి. పేమెంట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసినా, బుకింగ్ కాకపోయినా రిఫండ్ డబ్బులు వెంటనే వచ్చేస్తాయి. అదే సాధారణ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే రోజుల తరబడి వేచి చూడాలి.
News December 20, 2025
దేశంలో అతి తక్కువ ఫెర్టిలిటీ రేటు ఎక్కడంటే?

భారత్‌లో టోటల్ ఫెర్టిలిటీ రేటు అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా సిక్కిం (1.1) నిలిచింది. బిహార్‌లో(3.0) అత్యధిక ఫెర్టిలిటీ రేటు ఉంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందున్నట్లు కేంద్రం ఇటీవల వెల్లడించింది. ఈ అంశంలో జాతీయ సగటు 2.0 కాగా అంతకంటే తక్కువగా TGలో 1.8, APలో 1.7గా ఉంది. అంటే ఒక మహిళ తన లైఫ్ టైమ్‌లో సగటున ఇద్దరి కంటే తక్కువ మందికి జన్మనిస్తోందని అర్థం.


