News September 12, 2024
గతనెల ఎక్కువ మంది చూసిన వెబ్సైట్స్ ఇవే..

దేశంలో ఆగస్టు-2024లో అత్యధిక మంది వీక్షించిన వెబ్సైట్ల జాబితాను ‘సిమిలర్ వెబ్’ విడుదల చేసింది. తొలి స్థానంలో గూగుల్ ఉండగా రెండో స్థానంలో యూట్యూబ్ నిలిచింది. ఆ తర్వాత ప్లేసుల్లో ఎక్స్ హమ్స్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఉన్నాయి. ఇక గ్లోబల్ వైడ్గానూ 83.5 బిలియన్ విజిట్స్తో గూగుల్ టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఆ తర్వాత యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, x.com, వాట్సాప్ ఉన్నాయి.
Similar News
News November 24, 2025
పెద్దపెల్లి: ‘మూడో ఏటా ప్రవేశిస్తున్నా.. హామీలు నెరవేర్చేలేదు’

ఆరు గ్యారంటీలతో సహా అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల బతుకులు మాత్రం మార్చలేకపోయిందని సీపీఐ ఎంఎల్ (మాస్ లైన్ ప్రజాపంథా) కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులు ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకుని మూడో ఏట ప్రవేశించే సందర్భంలో సంబరాలు చేసుకుంటోందని, కానీ హామీలు నెరవేర్చలేదని పేర్కొంటూ సోమవారం పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు.
News November 24, 2025
అక్రమ మైనింగ్.. ఎమ్మెల్యే సోదరుడి ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

TG: పటాన్చెరు MLA మహిపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్కు చెందిన సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ కంపెనీ అక్రమ మైనింగ్ చేసిందని ఈడీ గుర్తించింది. అనుమతి లేకుండా, పరిమితికి మించి మైనింగ్ చేస్తూ రూ.300 కోట్లకుపైగా అక్రమాలకు పాల్పడినట్లు పేర్కొంది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.39Cr రాయల్టీ చెల్లించలేదని తెలిపింది. ఈ మేరకు మధుసూదన్కు చెందిన రూ.80 కోట్లు అటాచ్ చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది.
News November 24, 2025
ఎల్లుండి ఇలా చేస్తే వివాహ సమస్యలు దూరం!

ఎల్లుండి సుబ్రహ్మణ్య షష్ఠి. దీనిని స్కందషష్ఠి అని కూడా పిలుస్తారు. ఈరోజున సుబ్రహ్మణ్య ఆరాధన, సుబ్రహ్మణ్య భుజంగ స్త్రోత్ర పారాయణం, వల్లీ-దేవసేన కళ్యాణం వంటివి చేయాలని పండితులు సూచిస్తున్నారు. ఇవి చేస్తే జాతక పరంగా వివాహ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, సంతాన సమస్యలు, పిల్లల బుద్ధి కుశలత, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. SHARE IT


