News January 15, 2025

2025లో నెట్‌ఫ్లిక్స్‌లో వచ్చే సినిమాలు ఇవే

image

ఈ ఏడాది తమ OTTలో వచ్చే కొన్ని సినిమాల పేర్లను నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది.
☞ నాని ‘హిట్-3’, అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’
☞ విజయ్ దేవరకొండ- డైరెక్టర్ గౌతమ్ మూవీ (VD 12)
☞ నాగచైతన్య ‘తండేల్’, సూర్య ‘రెట్రో’
☞ రవితేజ ‘మాస్ జాతర’
☞ మ్యాడ్ సినిమా సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’
☞ సిద్ధూ జొన్నలగడ్డ ‘జాక్’
☞ నవీన్ పోలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’
☞ పవన్ కళ్యాణ్ ‘OG’

Similar News

News November 21, 2025

బిహార్ ఎన్నికలపై ఆరోపణలు.. ECI వివరణ ఇవ్వాలని డిమాండ్!

image

బిహార్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ లెక్కలు సరిపోలడం లేదని పొలిటికల్ ఎకనామిస్ట్ పి.ప్రభాకర్ ఆరోపించారు. పోలైన ఓట్ల కంటే కౌంటింగ్‌లో 1,77,673 ఓట్లు ఎక్కువగా వచ్చాయని Xలో <>పోస్టులు<<>> పెట్టారు. ఫైనల్ SIR ఫిగర్‌ను ప్రకటించిన తర్వాత కూడా మొత్తం ఓటర్ల సంఖ్యను EC 2సార్లు మార్చిందని, ఓటింగ్ శాతంపై విడుదల చేసిన ప్రకటనల్లోనూ తేడాలున్నాయన్నారు. దీనిపై ECI వివరణ ఇవ్వాలని పలువురు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

News November 21, 2025

హనుమాన్ చాలీసా భావం – 16

image

తుమ ఉపకార సుగ్రీవహి కీన్హా |
రామ మిలాయ రాజ పద దీన్హా ||
హనుమంతుడు నిస్సహాయ స్థితిలో ఉన్న సుగ్రీవునికి గొప్ప ఉపకారం చేశాడు. అతనికి శ్రీరాముడిని పరిచయం చేసి, ఆ మైత్రి ద్వారా కోల్పోయిన రాజ్యపదవిని తిరిగి ఇప్పించాడు. సమయస్ఫూర్తితో, సరైన మార్గదర్శకత్వంతో, నిస్వార్థ స్నేహ బంధాన్ని ఏర్పరచి ధర్మ సంస్థాపనకు తోడ్పడ్డాడు. ఆపదలో ఉన్నవారికి సాయపడే ఆంజనేయుడి నిరతి అందరికీ ఆదర్శం. <<-se>>#HANUMANCHALISA<<>>

News November 21, 2025

DWCWEOలో ఉద్యోగాలు

image

AP:బాపట్లలోని డిస్ట్రిక్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్& ఎంపవర్‌మెంట్ ఆఫీస్ 8 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంబీబీఎస్, ఇంటర్, బీఏ(సోషల్ వర్క్/సోషియాలజీ/సోషల్ సైన్సెస్), డిగ్రీ, బీఈడీ, 7వ తరగతి అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 25-42ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://bapatla.ap.gov.in/