News January 19, 2025
కొత్త రేషన్ కార్డులు వీరికే..

TG: కొత్త రేషన్ కార్డులకు 2014 నాటి మార్గదర్శకాలనే ప్రాతిపదికగా తీసుకున్నారు. గ్రామాల్లో కుటుంబ వార్షికాదాయం రూ.1.50 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలుగా నిర్ణయించారు. అలాగే గ్రామాల్లో 3.50 ఎకరాలు అంతకంటే తక్కువ విస్తీర్ణంలో తరి(మాగాణి) పొలం ఉన్న రైతులు, 7.5 ఎకరాలు అంతకంటే తక్కువగా మెట్ట (కుష్కి) ఉన్న రైతులు అర్హులు. కొత్త కార్డుల కోసం JAN 21-24 వరకు గ్రామసభల్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News October 19, 2025
వంటింటి చిట్కాలు

* కూరల్లో గ్రేవీ చిక్కబడాలంటే జీడిపప్పు పొడి, పాలు పోసి కలిపితే సరిపోతుంది.
* డీప్ ఫ్రై చేసేటప్పుడు నూనె పొంగకుండా ఉండాలంటే కాగిన నూనెలో కాస్త చింతపండు వేయాలి. ఆ తర్వాత డీప్ ఫ్రై చేసినా నూనె పొంగదు.
* తరిగిన బంగాళదుంపలు రంగు మారకుండా ఉండాలంటే ఆ ముక్కలపై వెనిగర్ చల్లాలి.
* వంకాయ కూరలో కాస్త నిమ్మరసం చేర్చితే కూర రంగు మారదు, రుచి కూడా పెరుగుతుంది.
News October 19, 2025
పండ్ల తోటలు: కొమ్మల కత్తిరింపులో జాగ్రత్తలు

పండ్ల తోటల్లో కొమ్మ కత్తిరింపుల వల్ల సూర్యరశ్మి లోపలి భాగాలకూ చేరి ఎదుగుదల బాగుంటుంది. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కత్తిరింపు పరికరాలను సోడియం హైపో/బ్లీచింగ్ పౌడర్ ద్రావణంలో ముంచిన తర్వాతే వాడుకోవాలి. లేదంటే ఏవైనా వ్యాధులు ఇతర చెట్లకు వ్యాపిస్తాయి. కత్తిరింపులు పూర్తయ్యాక చెట్ల భాగాలకు బ్లైటాక్స్ పేస్ట్/కాపర్ ఆక్సీక్లోరైడ్ పేస్ట్‌తో పూత వేయాలి. అధిక వర్షాలున్నప్పుడు కత్తిరింపులు చేయరాదు.
News October 19, 2025
ఐఐటీ ధన్బాద్లో ఉద్యోగాలు

IIT ధన్‌బాద్ 10 నాన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. జూనియర్ సూపరింటెండెంట్(లైబ్రరీ), జూనియర్ టెక్నీషియన్( లైబ్రరీ), జూనియర్ టెక్నీషియన్ (మెడికల్) పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి M.Lib.Sc/MLISc, పీజీ, B.Lib.Sc, BLISc,పీజీ డిప్లొమా, ఫార్మసీ డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈనెల 24వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.500. వెబ్సైట్: https://www.iitism.ac.in/