News December 30, 2024
ICC టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ నామినీలు వీరే..

ఈ ఏడాది టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేసిన బుమ్రా(65 వికెట్లు)కు ఐసీసీ మెన్స్ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ నామినీల్లో చోటు దక్కింది. మొత్తం నలుగురు ప్లేయర్లు ఈ లిస్టులో ఉన్నారు. ఇంగ్లండ్ నుంచి జో రూట్(1556 రన్స్), హ్యారీ బ్రూక్(1100 రన్స్), శ్రీలంక నుంచి కమిందు మెండిస్(1049 రన్స్) ఈ రేసులో నిలిచారు. విజేతను నిర్ణయించే మీ ఓటు వేసేందుకు ఇక్కడ <
Similar News
News November 24, 2025
సినిమా అప్డేట్స్

* రజినీకాంత్ పుట్టినరోజు సందర్భంగా DEC 12న జైలర్-2 టీజర్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.
* ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి’ సాంగ్కు ఇన్స్టా, యూట్యూబ్లో 500K+ రీక్రియేషన్స్ వచ్చినట్లు మేకర్స్ తెలిపారు.
* గోపీచంద్ మలినేని-బాలకృష్ణ మూవీలో తమన్నా స్పెషల్ సాంగ్ చేయనున్నట్లు టాక్.
* ప్రశాంత్ నీల్-జూ.ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతోన్న సినిమాలో ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు సమాచారం.
News November 24, 2025
చెరకు నరికిన తర్వాత ఆలస్యం చేస్తే..

చెరకు నరికిన తర్వాత రోజులు, గంటలు గడుస్తున్నకొద్దీ గడలలోని సుక్రోజ్ శాతం తగ్గుతుంది. ఈ గడలను గానుగాడించకుండా ఉంచితే.. నిల్వ కాలం పెరిగేకొద్దీ బరువు తగ్గుతుంది. చెరకు నరికిన తర్వాత 24 గంటలు ఆలస్యమైతే 1.5%, 48 గంటలు ఆలస్యమైతే 3%, 72 గంటలు ఆలస్యమైతే 5% వరకు దిగుబడిలో నష్టం జరుగుతుంది. అదే విధంగా రసనాణ్యతలోనూ 0.4%-0.6% వరకు క్షీణత కనిపిస్తుంది. నరికిన చెరకును నీడలో ఉంచితే ఈ నష్టం కొంత తగ్గుతుంది.
News November 24, 2025
పిల్లల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా?

ఇదివరకు పిల్లల ఫొటోలు, వీడియోలు కుటుంబం వరకే పరిమితమయ్యేవి. కానీ సోషల్మీడియా వచ్చిన తర్వాత పిల్లలకు సంబంధించిన ప్రతి విషయాన్నీ పేరెంట్స్ ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నారు. అయితే ఇది సరికాదంటున్నారు నిపుణులు. పిల్లల ప్రైవసీని కాపాడటం తల్లిదండ్రుల బాధ్యత. పిల్లల ఫొటోలు, వివరాలు షేర్ చేయడం వల్ల మార్ఫింగ్, ఐడెంటిటీ థెఫ్ట్ వంటి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని సూచిస్తున్నారు.


