News February 25, 2025
కోహ్లీ చేసిన 82 సెంచరీల్లో నాన్ స్ట్రైకర్స్ వీళ్లే!

ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచులో టీమ్ఇండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. దీనితో విరాట్ ఖాతాలో అన్ని ఫార్మాట్లలో కలిపి 82 సెంచరీలు చేరాయి. కోహ్లీ సెంచరీలు చేసిన 82 సార్లు నాన్ స్ట్రైకర్గా ఎవరో ఉన్నారనే లిస్టును ఓ నెటిజన్ షేర్ చేయగా వైరలవుతోంది. తొలి సెంచరీ చేసినప్పుడు గౌతమ్ గంభీర్ తనకు నాన్ స్ట్రైకర్గా ఉండగా 82వ టన్కు అక్షర్ పటేల్ ఉన్నారు.
Similar News
News November 10, 2025
హనుమాన్ చాలీసా భావం – 5

హాథ వజ్ర ఔరు ధ్వజా విరాజై |
కాంధే మూంజ జనేవూ సాజై ||
హనుమంతుని ఒక చేతిలో ఎంతటి శత్రువునైనా మట్టుబెట్టేంత శక్తి కలిగిన వజ్రాయుధం(గద), మరో చేతిలో విజయానికి ప్రతీకైన పతాకం ప్రకాశిస్తుంటాయి. ఆయన భుజంపై ఉండే జంధ్యం ఆయన అపారమైన శక్తి, విజయం మరియు, సూచిస్తుంది. మనం కూడా హనుమంతునిలా ధైర్యాన్ని, సత్యాన్ని ఆశ్రయిస్తే జీవితంలో తప్పక విజయం సాధిస్తాం. <<-se>>#HANUMANCHALISA<<>>
News November 10, 2025
NHSRCలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే ఆఖరు తేదీ

నేషనల్ హెల్త్ సిస్టమ్స్ రిసోర్స్ సెంటర్(NHSRC)లో 4 పోస్టులకు దరఖాస్తులు చేయడానికి రేపే ఆఖరు తేదీ. వీటిలో సీనియర్ కన్సల్టెంట్, జూనియర్ కన్సల్టెంట్, సెక్రటేరియల్ ఎగ్జిక్యూటివ్, అకౌంట్స్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి డిప్లొమా, డిగ్రీ, బీకామ్, ఎంబీఏ, ఎంబీబీఎస్, బీడీఎస్, నర్సింగ్, బీహెచ్ఎంస్, బీఏఎంస్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్సైట్: https://nhsrcindia.org/
News November 10, 2025
అందెశ్రీ మరణం సాహితీ లోకానికి తీరని లోటు: సీఎం చంద్రబాబు

ప్రముఖ కవి, తెలంగాణకు రాష్ట్ర గీతాన్ని అందించిన డా.అందెశ్రీ మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. ఆయన మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటన్నారు. అందెశ్రీ మరణం పట్ల మంత్రి లోకేశ్ విచారం వ్యక్తం చేశారు. మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు అనే పాటతో పాటు ఎన్నో ఉద్యమ గీతాలు రాసిన ప్రజాకవికి శ్రద్ధాంజలి అని ట్వీట్ చేశారు. పలువురు ఏపీ మంత్రులు అందెశ్రీకి నివాళి అర్పించారు.


