News August 6, 2025
‘ఫ్రీ బస్సు’ పథకం అధికారిక వివరాలు ఇవే

AP: మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. ‘ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్త్రీశక్తి పథకాన్ని అమలు చేయనున్నాం. RTCలోని 75%(8,456) బస్సుల్లో ఉచితంగా ప్రయాణించొచ్చు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో పథకం అమలవుతుంది. కుటుంబానికి నెలకు రూ.800 ఆదా అవుతుందని భావిస్తున్నాం’ అని తెలిపారు.
Similar News
News August 7, 2025
ఈ ‘స్వామి’ ఆకలి కేకలను దూరం చేశాడు

భారత రత్న, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ MS స్వామినాథన్ 3 పదుల వయసులోనే దేశ భవిష్యత్ మార్చారు. కరవుతో అల్లాడుతున్న ప్రజలకు కాంతిరేఖలా మారారు. జపాన్, US, మెక్సికో శాస్త్రవేత్తలతో కలిసి వరి, గోధుమ వంగడాలపై ఆయన చేసిన పరిశోధనలు ఆకలి కేకలను దూరం చేశాయి. ఆ తర్వాత భారత్ వెనుతిరిగి చూడలేదు. విదేశాలకు ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఆ మహనీయుడి జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకుందాం.
News August 7, 2025
రేషన్ లబ్ధిదారులకు నిరాశ

AP: రేషన్ షాపుల్లో కందిపప్పు ఈ నెల కూడా పంపిణీ చేయకపోవడంతో లబ్ధిదారులు నిరాశ చెందుతున్నారు. కొంతకాలంగా సరఫరా నిలిచిపోగా, పండుగల సీజన్ కావడంతో ఈసారి ఇస్తారని అంతా భావించారు. షాపులకు వెళ్లాక అసలు విషయం తెలిసి అసంతృప్తి చెందుతున్నారు. కొన్నిచోట్ల అరకొరగా పంపిణీ జరుగుతున్నట్లు తెలుస్తోంది. మార్కెట్‌లో KG ₹120 ఉండటంతో రేషన్ షాపుల్లో పంపిణీ చేయాలని కోరుతున్నారు. మీకు కందిపప్పు అందిందా? కామెంట్ చేయండి.
News August 7, 2025
మళ్లీ పెరిగిన గోల్డ్ & సిల్వర్ రేట్స్!

బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెరిగి షాకిచ్చాయి. హైదరాబాద్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹220 పెరిగి ₹1,02,550కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹200 పెరిగి ₹94,000 పలుకుతోంది. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,27,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.