News December 24, 2024
అల్లు అర్జున్‌ను విచారించేది వీరే..

TG: అల్లు అర్జున్ కాసేపట్లో తన లీగల్ టీమ్‌తో భేటీ కానున్నారు. అనంతరం ఆ టీమ్‌తోనే ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లనున్నారు. అల్లు అర్జున్‌కు నిన్న పోలీసులు BNS 35(3) కింద నోటీసులిచ్చారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించి చిక్కడపల్లి ఏసీపీ రమేశ్, సీఐ రాజు ఆయన్ను ప్రశ్నించనున్నారు. తొక్కిసలాట కేసులో బన్నీ A11గా ఉండగా, నాలుగు వారాల వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.
Similar News
News October 18, 2025
గ్రూప్-2 అభ్యర్థులకు 48hrs ముందే దీపావళి: CM

TG: గ్రూప్-2 ఉద్యోగాలకు ఎంపికైన వారికి 48 గంటల ముందే దీపావళి వచ్చిందని CM రేవంత్ అన్నారు. HYDలో వారికి నియామక పత్రాలను అందజేశారు. ‘₹లక్ష కోట్లతో కట్టిన “కాళేశ్వరం” మూడేళ్లలోనే కూలింది. గత పాలకులు వారి కుటుంబాల కోసమే ఆలోచించారు. పదేళ్లలో నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించలేదు. తన ఫామ్‌హౌస్‌లో ఎకరా పంటపై ₹కోటి ఆదాయం వస్తుందన్న పెద్దాయన.. ఆ విద్యను ప్రజలకు ఎందుకివ్వలేదు’ అని ప్రశ్నించారు.
News October 18, 2025
ఈ పండ్లలో అధిక పోషకాలు

*ఆపిల్: ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
*అరటి- పొటాషియం, విటమిన్ B-6 వల్ల శక్తి అందుతుంది.
* జామ: విటమిన్ C, ఫైబర్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
*బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ: యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. గుండె ఆరోగ్యానికి మంచివి.
*ఆరెంజ్: విటమిన్ C వల్ల ఇమ్యూనిటీ పెరగడంతో పాటు చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
*దానిమ్మ, బొప్పాయి, కివీ, ఉసిరిలోనూ పోషకాలుంటాయి.
News October 18, 2025
గల్లీలో కాదు.. ఢిల్లీలో పోరాడండి: హరీశ్ రావు

TG: BC రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్, BJP గల్లీలో కాకుండా ఢిల్లీలో పోరాటం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘కేంద్రంలో BJP, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నాయి. ఈ 2 పార్టీలు మద్దతిచ్చాక రిజర్వేషన్ల పెంపును ఆపేదెవరు? పార్లమెంటులో రాజ్యాంగ సవరణ ద్వారా BC రిజర్వేషన్ల పెంపు సాధించాల్సింది పోయి కాలయాపన చేస్తున్నాయి. ఏ పార్టీ బిల్లు పెట్టినా BRS మద్దతు ఉంటుంది’ అని ట్వీట్ చేశారు.