News November 25, 2024
IPL: ఈరోజు వేలానికి వచ్చేది వీరే..
డుప్లెసిస్, ఫిలిప్స్, విలియమ్సన్, సామ్ కరన్, మిచెల్, కృనాల్ పాండ్య, సుందర్, శార్దుల్ ఠాకూర్, ఇంగ్లిస్, దీపక్ చాహర్, ఫెర్గ్యూసన్, భువనేశ్వర్ కుమార్, ముకేశ్ కుమార్, ముజీర్ రెహ్మాన్, మోయిన్ అలీ, టిమ్ డేవిడ్, విల్ జాక్స్, ముస్తాఫిజుర్, నవీన్ ఉల్ హక్, ఉమేశ్ యాదవ్, స్టీవ్ స్మిత్, లూయిస్, శాంట్నర్, హెన్రీ, అల్జరీ జోసెఫ్, హోల్డర్ etc. పూర్తి లిస్ట్ కోసం <
Similar News
News November 25, 2024
గాలి నాణ్యతను బట్టి భూమి ధరను నిర్ధారించాలి: జెరోధా సీఈవో
కాలుష్యాన్ని తగ్గించాలంటే గాలి&నీటి నాణ్యతను బట్టి ఆ ప్రాంత భూమి ధరను నిర్ణయించేలా రూల్ తేవాలని జెరోధా CEO నితిన్ అభిప్రాయపడ్డారు. ‘ఇలా చేస్తే అక్కడున్న యజమానులంతా గ్రూప్‌గా మారి పర్యావరణంపై దృష్టి పెడతారు. నా అనే ఇల్లు గురించి ఆలోచిస్తేనే మన లేఅవుట్ పరిస్థితులు మారతాయి. AQIలో ఢిల్లీపైనే అందరూ దృష్టిసారించినా ముంబై, చెన్నై, బెంగళూరు తదితర ప్రాంతాల్లోనూ గాలి నాణ్యత పడిపోయింది’ అని ట్వీట్ చేశారు.
News November 25, 2024
నేటి నుంచి లోక్‌సభలో ఓ కొత్త సంప్రదాయం
లోక్‌సభలో ఓ కొత్త సంప్రదాయం మొదలవ్వనుంది. ఇక నుంచి సభకు హాజరయ్యే ఎంపీలు ఎలక్ట్రానిక్ ట్యాబ్‌లో డిజిటల్ పెన్‌తో అటెండెన్స్ వేయాల్సి ఉంటుంది. పార్లమెంటులో పేపర్ వాడకూడదన్న స్పీకర్ ఓం బిర్లా ఆకాంక్ష మేరకు లాబీలో 4 కౌంటర్ల వద్ద ట్యాబుల్ని ఉంచుతున్నామని LS సెక్రటేరియట్ తెలిపింది. ఫిజికల్ అటెండెన్స్ రిజిస్టర్లూ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. గతంలో సభ్యులు మొబైల్ యాప్ ద్వారా అటెండెన్స్ వేసేవాళ్లు.
News November 25, 2024
ఇవాళ విచారణకు హాజరు కాలేను: RGV
విచారణకు ఇవాళ హాజరు కాలేనని డైరెక్టర్ RGV తన అడ్వకేట్ శ్రీనివాసరావుకు సమాచారమిచ్చారు. కారణాలను ఒంగోలు పోలీసులకు చెబుతానన్నారు. వ్యూహం సినిమా ప్రమోషన్లలో భాగంగా చంద్రబాబు, పవన్‌లపై అనుచిత పోస్టులు పెట్టారని ప్రకాశం (M) మద్దిపాడులో RGVపై కేసు నమోదైంది. విచారణకు రావాలని పోలీసులు నోటీసులివ్వగా రాలేనని వారం కిందట చెప్పిన ఆయన ఇవాళ మరోసారి డుమ్మా కొట్టారు. దీనిపై పోలీసులు ఎలా స్పందిస్తారో చూడాలి.