News August 7, 2024
‘పొన్నియన్ సెల్వన్’కు మొదట అనుకున్న హీరోలు వీళ్లే!

మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని సినీ వర్గాలు పంచుకున్నాయి. ఈ సినిమా తీసేందుకు 2010లోనే మణిరత్నం భారీగా ప్లాన్ చేశారట. మహేశ్బాబు, విజయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తారని ప్రకటించగా.. మూవీకి సంబంధించిన ఫొటోషూట్ కూడా సూపర్ స్టార్ పూర్తి చేశారు. కానీ, బడ్జెట్, పరిమిత VFX సాంకేతికత కారణంగా అప్పుడు నిలిపివేశారు. 2022లో విక్రమ్, కార్తీ, జయం రవితో తీశారు.
Similar News
News October 30, 2025
రేపు అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం!

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.15గంటలకు రాజ్ భవన్లో జరిగే కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులకు ఆహ్వాన లేఖలు అందినట్లు సమాచారం.
News October 30, 2025
అది వారి ‘రేటు జాబితా’.. ప్రతిపక్షాల మ్యానిఫెస్టోపై మోదీ సెటైర్లు

బిహార్లో ప్రతిపక్ష మహాగఠ్బంధన్ విడుదల చేసిన మ్యానిఫెస్టోపై ప్రధాని నరేంద్ర మోదీ సెటైర్లు వేశారు. ‘జంగిల్ రాజ్ నాయకులు ప్రజలను నిరంతరం మోసం చేస్తున్నారు. మ్యానిఫెస్టో పేరుతో ఆర్జేడీ, కాంగ్రెస్ తమ రేటు జాబితాను రివీల్ చేశాయి. వారి ప్రతి డిక్లరేషన్ వెనుక ప్రధాన ఉద్దేశం అవినీతి, దోపిడీ’ అని ఆరోపించారు. బిహార్ను RJD, కాంగ్రెస్ డెవలప్ చేయలేవని, గతంలో తమ పాలనలో ప్రజలను మోసం చేశాయని అన్నారు.
News October 30, 2025
ప్రెగ్నెన్సీలో అయోడిన్ లోపంతో ఎన్నో సమస్యలు

థైరాయిడ్ పనితీరుకు, శారీరక, మానసిక అభివృద్ధికి అయోడిన్ ఎంతో ముఖ్యం. గర్భిణుల్లో అయోడిన్ లోపం ఉంటే పుట్టే పిల్లల్లో మానసిక, శారీరక అభివృద్ధి ఉండదు. అలాగే గర్భస్రావం, వికలాంగ శిశువు, మరుగుజ్జు, చెవి, కంటి సమస్యలు, నత్తి వంటివి వస్తాయంటున్నారు నిపుణులు. పాలు, పెరుగు, బ్రౌన్ రైస్, చేపలు, ఉప్పు, కాడ్ లివర్ ఆయిల్, మాంసం, గుడ్లు, ఆకుకూరలు, మిల్లెట్స్ వంటివి ఆహారంలో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.


