News March 27, 2024

పెండింగ్ స్థానాలు ఇవే

image

AP: టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి మరో 8 <<12937700>>అసెంబ్లీ<<>> స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఆ జాబితాలో టీడీపీ పోటీ చేసే ఆరు నియోజకవర్గాలు చీపురుప‌ల్లి, భీమిలి, దర్శి, అనంతపురం అర్బన్‌, గుంతకల్లు, ఆలూరు ఉన్నాయి. ఇక జనసేన పాలకొండ, విశాఖ సౌత్‌, అవనిగడ్డ స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించాల్సి ఉంది. ఈ స్థానాల్లో ఆశావహుల నుంచి పోటీ తీవ్రంగా ఉండటంతో ఆయా పార్టీల అధినేతలకు తలనొప్పిగా మారింది.

Similar News

News January 24, 2026

ఆస్ట్రేలియాతో టెస్ట్.. భారత జట్టు ప్రకటన

image

ఉమెన్స్: ఆస్ట్రేలియాతో పెర్త్‌లో మార్చి 6వ తేదీ ఆడనున్న ఒకే ఒక టెస్ట్ మ్యాచ్‌కు 15 మందితో కూడిన భారత జట్టును BCCI ప్రకటించింది. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు.
జట్టు: హర్మన్ ప్రీత్ కౌర్(C), స్మృతి మంధాన(VC), షెఫాలీ, జెమీమా, అమన్‌జోత్, రిచా, ఉమ, ప్రతికా రావల్, హర్లీన్, దీప్తి, రేణుక, స్నేహ్ రాణా, క్రాంతి, వైష్ణవి, సయాలి.

News January 24, 2026

సహజ కాన్పుతో సమస్యలు వస్తాయా?

image

నార్మల్ డెలివరీ అయినా మహిళల్లో కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. డెలివరీ తర్వాత యోని పుండ్లు పడటం, ఇన్ఫెక్షన్లు రావడం, గర్భాశయ వ్యాధి, మూత్ర విసర్జన సమస్యలు వస్తాయి. కొందరికి నార్మల్ డెలివరీలో కుట్లు వేస్తారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్నిసార్లు కుట్లు విడిపోయే ప్రమాదం కూడా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి సహజ కాన్పు తర్వాత కూడా జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

News January 24, 2026

రథ సప్తమి రోజున ‘7’ అంకె ప్రాముఖ్యత

image

ప్రకృతిలో 7 అంకెకు ఎంతో ప్రాధాన్యముంది. సప్త స్వరాలు, వారాలు, రుషులు, 7 కొండలే కాకుండా సూర్యుడి తొలి 7 కిరణాలు కూడా అంతే ముఖ్యమైనవి. అవి: సుషుమ్న, హరికేశ, విశ్వకర్మ, విశ్వశ్రవ, సంపద్వసు, అర్వాగ్వసు, స్వరాణ్. ఈ ఏడు కిరణాలు ఏడు రంగులకు (VIBGYOR) మూలమని చెబుతారు. ఇవి విశ్వమంతా శక్తిని, ఆరోగ్యాన్ని నింపుతాయని శాస్త్ర వచనం. సూర్యుని రథానికి ఉండే ఏడు గుర్రాలు కూడా ఈ కిరణాలలోని అద్భుత శక్తికి సంకేతాలే.