News January 30, 2025

రెగ్యులరైజేషన్‌కు అర్హులు వీరే

image

AP: గ్రామాల్లో నెలకు గరిష్ఠంగా రూ.10,000, పట్టణాల్లో రూ.14,000 ఆదాయం మాత్రమే ఉండాలి. నెలకు రూ.300లోపే విద్యుత్తు ఛార్జీలు చెల్లించి ఉండాలి. మెట్ట, మాగాణి కింద కలిపి 10 ఎకరాలకు మించి ఉండకూడదు. RCC రూఫ్‌/ఆస్‌బెస్టాస్‌ రూఫ్‌ను ఇటుక గోడలతో నిర్మించి ఉండాలి. రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్, ఆస్తిపన్ను చెల్లింపు, విద్యుత్తు బిల్లు, వాటర్‌ బిల్లులను పరిగణనలోకి తీసుకుని క్రమబద్ధీకరిస్తారు.

Similar News

News November 24, 2025

సింగూరు డ్యామ్‌లో 1 నుంచి ‘ఖాళీ’ పనులు

image

మహానగరానికి తాగునీరు అందించే సింగూరు జలాశయం మరమ్మతులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలంటే ముందుగా జలాశయంలో నీటిమట్టం తగ్గించాలి. అందుకే వచ్చేనెల ఒకటో తేదీ నుంచి రోజుకు 30 సెంటీమీటర్లు నీటిని తోడేయాలని నీటిపారుదల శాఖ అధికారులు నిర్ణయించారు. నీటిమట్టాన్ని 517.8 మీటర్లకు తెచ్చి (ప్రస్తుత నీటిమట్టం 520.49 మీ.) ఆ తర్వాత పనులు ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.

News November 24, 2025

Free movies, Free downloads ప్రమాదకరం: సజ్జనార్

image

అనుమానాస్పద లింక్స్, ఫ్రీ మూవీ సైట్స్‌ను క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల వలలో పడొద్దని HYD CP సజ్జనార్ హెచ్చరించారు. అలాంటి వాటిపై క్లిక్ చేస్తే అకౌంట్స్ హ్యాక్ చేసి డేటాను దొంగిలిస్తారని, తర్వాత బ్లాక్‌మెయిల్‌కు దిగుతారని పేర్కొన్నారు. ‘Free movies, Free downloads అంటూ ఉచితమనిపించే కంటెంట్ ప్రమాదకరం. ఇలాంటి ఫేక్ సైట్లు, యాప్స్ ఎప్పుడూ క్లిక్ చేయొద్దు. స్ట్రాంగ్ పాస్‌వర్డ్స్ పెట్టుకోండి’అని సూచించారు.

News November 24, 2025

314 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా

image

భారత్-సౌతాఫ్రికా రెండో టెస్టులో మూడో రోజు ఆట ముగిసింది. తొలి ఇన్నింగ్సులో భారత్ 201 పరుగులకు <<18375894>>ఆలౌటైంది<<>>. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన RSA ఆట ముగిసే సమయానికి 26/0 రన్స్ చేసింది. బవుమా సేన 314 పరుగుల ఆధిక్యంలో ఉంది.