News December 19, 2024
దోమలు ఎక్కువగా టార్గెట్ చేసేది వీరినే..!

చుట్టుపక్కల ఎంత మంది ఉన్నా కొందరినే దోమలు ఎక్కువగా కుడతాయి. ఇందుకు కొన్ని కారణాలు ఉన్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. శరీర ఉష్ణోగ్రత ఎక్కువ ఉన్నా, చెమట ఎక్కువగా పట్టినా దోమలు వారికి ఎట్రాక్ట్ అవుతాయి. మద్యపానం చేసేవారికి, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా విడుదల చేసేవారిని టార్గెట్ చేసి కుడతాయి. నలుపు, ఆకుపచ్చ, ఊదా రంగు దుస్తులు ధరించినా వారిని వదలవు. ఇక O, AB బ్లడ్ గ్రూప్ వారు దొరికితే దోమలకు పండగే.
Similar News
News November 21, 2025
బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.