News April 3, 2025

భారత్‌లో భూకంపాలు వచ్చే ప్రదేశాలు ఇవే!

image

మయన్మార్‌లో భూకంపం సంభవించి వేలాది మంది ప్రజలు మృత్యువాత పడిన విషయం తెలిసిందే. కాగా మనదేశంలో కూడా భూప్రకంపనలు సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, JK ప్రాంతాలు 9 తీవ్రతతో భూకంపాలు వచ్చే జోన్ పరిధిలో ఉన్నాయి. ఢిల్లీ, హరియాణా, మహారాష్ట్రలో 8, రాజస్థాన్, కొంకణ్ తీరంలో 7, కర్ణాటక, TG, AP, ఒడిశా, MPలో 7 కంటే తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Similar News

News April 4, 2025

నేటి ముఖ్యాంశాలు

image

TG: తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకు కంచ గచ్చిబౌలిలో చెట్లు కొట్టొద్దు: సుప్రీంకోర్టు
TG: SC తీర్పు HCU విద్యార్థుల విజయం: ప్రతిపక్షాలు
TG: HCU భూముల వివాదంపై కమిటీ వేసిన ప్రభుత్వం
TG: హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు
AP: అమరావతిని సందర్శించండి.. సామ్ ఆల్ట్‌మన్‌కు CM చంద్రబాబు ఆహ్వానం
US టారిఫ్‌లు, చైనా ఆక్రమణలపై ఏం చేస్తున్నారు?: రాహుల్
లోక్‌సభలో పాస్.. రాజ్యసభ ముందుకు వక్ఫ్ సవరణ బిల్లు

News April 4, 2025

వాసుదేవరెడ్డి రిలీవ్

image

AP: లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న APSBCL మాజీ ఎండీ వాసుదేవరెడ్డి రాష్ట్రం నుంచి రిలీవ్ అయ్యారు. రైల్వే శాఖలో ఉన్న ఆయన 2019 AUGలో డిప్యుటేషన్‌పై APకి వచ్చారు. గతేడాది AUG 25తో గడువు ముగిసింది. అయితే మద్యం కేసు కారణంగా ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. రైల్వే బోర్డు సమ్మతితో FEB 25 వరకు డిప్యుటేషన్‌ను పొడిగించింది. మళ్లీ పొడిగింపునకు రైల్వే నిరాకరించడంతో తక్షణమే రిలీవ్ చేస్తూ ఆదేశాలిచ్చింది.

News April 4, 2025

BREAKING: SRH ఘోర ఓటమి

image

SRH హ్యాట్రిక్ ఓటమిని మూటగట్టుకుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌పై KKR 80 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆరెంజ్ ఆర్మీ 16.4 ఓవర్లలో 120 పరుగులకే కుప్పకూలింది. క్లాసెన్ 33, కమిందు 27, నితీశ్ 19, కమిన్స్ 14 మినహా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. వైభవ్, వరుణ్ చెరో 3 వికెట్లు, రస్సెల్ 2, హర్షిత్, నరైన్ చెరో వికెట్ తీశారు.

error: Content is protected !!