News June 2, 2024
ఇతర దేశాలకు ఆడుతున్న భారత సంతతి ప్లేయర్లు వీరే!

టీ20 వరల్డ్ కప్లో చాలా మంది భారత సంతతి ఆటగాళ్లు వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వారిలో రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), కేశవ్ మహారాజ్ (సౌతాఫ్రికా), తేజ (నెదర్లాండ్స్), కశ్యప్ ప్రజాపతి (ఒమన్), అల్ఫేశ్ రంజనీ, రోనక్ పటేల్ (ఉగాండా), రవీందర్, నిఖిల్, పర్గత్, శ్రేయస్ మొవ్వ (కెనడా), మోనాంక్ పటేల్, హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్, నిసర్గ్ పటేల్, నితీశ్ కుమార్, సౌరభ్ నేత్రావాల్కర్ (USA) ఉన్నారు.
Similar News
News October 26, 2025
రేపు ఉదయం 11గంటలకు..

TG: మద్యం దుకాణాల లైసెన్స్ల ఎంపిక లాటరీ పద్ధతిలో రేపు ఉదయం 11గంటలకు ప్రారంభం కానుంది. కలెక్టర్ల చేతుల మీదుగా లక్కీ డ్రా నిర్వహణ జరగనుంది. మద్యం దుకాణాల లాటరీ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. రాష్ట్రంలో 2,620 మద్యం షాపులకు 95,137 దరఖాస్తులు వచ్చాయి. అత్యధికంగా శంషాబాద్లో 100 మద్యం దుకాణాలకు 8,536 దరఖాస్తులు రాగా, సరూర్నగర్లో 134 మద్యం షాపులకు 7,845 అప్లికేషన్లు వచ్చాయి.
News October 26, 2025
దూసుకొస్తున్న తుఫాను.. 20 జిల్లాల్లో సెలవులు

AP: ‘మొంథా’ తుఫాను రాష్ట్ర తీర ప్రాంతం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు 20జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. అనంతపురం, సత్యసాయి, నంద్యాల, KNL, తిరుపతి, SKL జిల్లాల్లో హాలిడేస్ ఇవ్వలేదు. పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది. తీవ్ర ప్రభావం చూపే కాకినాడ జిల్లాలో 27 నుంచి 31 వరకు హాలిడే ప్రకటించారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులిచ్చారు.
News October 26, 2025
మొంథా తుఫాను పయనమిలా..

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం గడిచిన 6 గంటల్లో 8Kmph వేగంతో కదిలిందని APSDMA తెలిపింది. ప్రస్తుతానికి చెన్నైకి 720km, విశాఖపట్నానికి 790km, కాకినాడకి 780km దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఇది 12 గంటల్లో నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడుతుందని తెలిపింది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారి, ఆరోజు రాత్రి కాకినాడ సమీపంలో తీరం దాటే ఛాన్స్ ఉందని పేర్కొంది.


