News February 10, 2025
వన్డేల్లో అత్యధిక సెంచరీలు వీరివే
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739136596468_893-normal-WIFI.webp)
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో విరాట్ కోహ్లీ(50) తొలి స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో సచిన్ టెండూల్కర్ (49), మూడో స్థానంలో రోహిత్ శర్మ (32) ఉన్నారు. తర్వాతి స్థానాల్లో వరుసగా రికీ పాంటింగ్ (30), జయసూర్య (28), ఆమ్లా (27), ఏబీ డివిలియర్స్ (25), క్రిస్ గేల్ (25), కుమార సంగక్కర (25) కొనసాగుతున్నారు. టాప్-3లో ముగ్గురూ భారతీయులే ఉండటం విశేషం.
Similar News
News February 10, 2025
BREAKING: అకౌంట్లో డబ్బుల జమ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_12025/1738029385955_893-normal-WIFI.webp)
తెలంగాణలోని రైతులకు శుభవార్త. 2 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఒక్కొక్కరికి రూ.6వేల చొప్పున మొత్తం 8.65 లక్షల మంది ఖాతాల్లో రూ.707.54 కోట్లు జమ చేసింది. కాగా ఇప్పటికే ఎకరం పొలం ఉన్న 17 లక్షల మంది రైతులకు రూ.557 కోట్లు, 557 పైలట్ గ్రామాలకు చెందిన వారికి రూ.568 కోట్లు జమ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మొత్తం 30.11 లక్షల మంది రైతులకు రూ.1834.09కోట్లు జమ అయ్యాయి.
News February 10, 2025
రంగరాజన్‌పై దాడి.. స్పందించిన DCP
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739192320984_81-normal-WIFI.webp)
TG:చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై ఇటీవల జరిగిన దాడి <<15408903>>ఘటనపై <<>>రాజేంద్రనగర్ DCP శ్రీనివాస్ స్పందించారు. ‘ఇవాళ ఇద్దరు మహిళలు సహా ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపాం. నిందితులు ఖమ్మం, నిజామాబాద్‌కు చెందిన వారు. 2022లో వీరరాఘవరెడ్డి ‘రామరాజ్యం’ అనే సంస్థను ప్రారంభించారు. సంస్థలో సభ్యులను చేర్పించాలని, ఆర్థిక సాయం చేయాలని రంగరాజన్‌ను కోరారు. ఒప్పుకోకపోవడంతో దాడి చేశారు’ అని చెప్పారు.
News February 10, 2025
పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_92022/1662720797697-normal-WIFI.webp)
తెలంగాణ ప్రభుత్వానికి డెడికేటెడ్ బీసీ కమిషన్ 700 పేజీలతో నివేదిక సమర్పించింది. ఈ కమిషన్ నివేదిక ఆధారంగానే రిజర్వేషన్లు ఖరారు కానున్నాయి. గ్రామం ఒక యూనిట్‌గా వార్డు సభ్యుల రిజర్వేషన్లు, మండలం ఒక యూనిట్‌గా ఎంపీటీసీల రిజర్వేషన్లు, జిల్లా ఒక యూనిట్‌గా ZPTCల రిజర్వేషన్లు, రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని ZP ఛైర్మన్ రిజర్వేషన్లను పంచాయతీ రాజ్ శాఖ ఖరారు చేయనుంది.