News November 25, 2024
APలో పీపీపీ పద్ధతిలో నిర్మించే రోడ్లు ఇవే

చిలకలపాలెం-రామభద్రపురం-రాయగడ, VZM-పాలకొండ, కళింగపట్నం-శ్రీకాకుళం-పార్వతీపురం, భీమునిపట్నం-నర్సీపట్నం, కాకినాడ-జొన్నాడ, కాకినాడ-RJY, ఏలూరు-మేడిశెట్టివారిపాలెం, నర్సాపురం-అశ్వారావుపేట, ఏలూరు-జంగారెడ్డిగూడెం, GNT-పర్చూరు, GNT-బాపట్ల, మంగళగిరి-తెనాలి-నారాకోడూరు, బేస్తవారిపేట-ఒంగోలు, రాజంపేట -గూడూరు, ప్యాపిలి-బనగానపల్లి, దామాజీ పల్లి-తాడిపత్రి, జమ్మలమడుగు -కొలిమిగుండ్ల, సోమందేపల్లి-హిందూపురం-తూముకుంట
Similar News
News December 7, 2025
రూ.24 రీఫండ్ కోసం రూ.87,000 పోగొట్టుకుంది

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ మహిళ సైబర్ మోసానికి గురైంది. జెప్టోలో కూరగాయలు ఆర్డర్ చేసిన ఆమె రీఫండ్ కోసం పొరపాటున ఆన్లైన్లో రాంగ్ కస్టమర్ నంబర్‌కు కాల్ చేసింది. ఇదే అదనుగా కేటుగాళ్లు ఆమెకు వాట్సాప్‌లో APK ఫైల్ పంపించి బ్యాంక్ వివరాలతో మూడు అకౌంట్ల నుంచి రూ.87వేలు కొట్టేశారు. మోసపోయానని గ్రహించిన మహిళ సైబర్ హెల్ప్‌లైన్ నంబర్ 1930కి, పోలీసులకు ఫిర్యాదు చేసింది.
News December 7, 2025
కర్ణాటక కాంగ్రెస్‌లో ముగియని ‘కుర్చీ’ వివాదం

కర్ణాటక కాంగ్రెస్‌లో సిద్దరామయ్య, డీకే శివకుమార్‌ల మధ్య CM పీఠంపై ఏర్పడిన చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. గత వారం ఈ ఇద్దరితో అధిష్ఠానం చర్చించగా వివాదం సమసినట్లు కనిపించింది. కానీ తాజాగా ‘మార్పు’కు సిద్ధం కావాలని DK ఓ సమావేశంలో సహచరులకు సూచించడంతో అదింకా ముగియలేదని స్పష్టమవుతోంది. ‘దేవుడు అవకాశాలను మాత్రమే ఇస్తాడు. వాటితో మనం ఏం చేస్తామో అదే ముఖ్యం. ‘మార్పు’కు సిద్ధంగా ఉండండి’ అని వివరించారు.
News December 7, 2025
ఇతిహాసాలు క్విజ్ – 89 సమాధానం

ఈరోజు ప్రశ్న: కురుక్షేత్రంలో పాల్గొన్న వృద్ధరాజు. భీష్ముడికి తండ్రి వరుస అవుతాడు. ధర్మం వైపు మొగ్గు ఉన్నా, రాజధర్మం కారణంగా కౌరవులకు మద్దతు ఇచ్చాడు. చివరికి భీముడి చేత మరణం పొందాడు. ఎవరతను?
సమాధానం: బాహ్లికుడు. ఈయన శంతనుడి సోదరుడు.
<<-se>>#Ithihasaluquiz<<>>


