News August 8, 2025

ఇండియాలో సురక్షితమైన నగరాలు ఇవే!

image

Numbeo Safety Index mid-2025 ర్యాంకింగ్స్ ప్రకారం ప్రపంచంలో సురక్షిత దేశాల జాబితాలో భారత్ 67వ స్థానంలో నిలిచింది. మన దేశంలో మంగళూరు, వడోదర, అహ్మదాబాద్, సూరత్, జైపూర్, నవీ ముంబై, తిరువనంతపురం, చెన్నై, పుణే, చండీగఢ్ టాప్-10లో చోటు దక్కించుకున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క సిటీకి కూడా చోటు దక్కలేదు. ప్రపంచంలో సురక్షితమైన నగరాల్లో అబుదాబి, దోహా, దుబాయ్, షార్జా, తైపీ టాప్-5లో ఉన్నాయి.

Similar News

News August 8, 2025

హైదరాబాద్‌కు భారీ వర్షసూచన

image

TG: రానున్న రెండు గంటల్లో హైదరాబాద్‌లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించింది. ఈ నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. మరోవైపు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, భూపాలపల్లి, నిర్మల్‌ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

News August 8, 2025

మీ జన్ ధన్ ఖాతా KYC అప్‌డేట్ చేయించారా?

image

ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన బ్యాంకు ఖాతాలు తీసుకుని పదేళ్లు పూర్తయిన వారు రీ-కేవైసీ చేయించాలని RBI సూచించింది. దీని గడువు సెప్టెంబర్ 30తో ముగియనుంది. గ్రామాల్లో ఏర్పాటు చేసిన స్పెషల్ క్యాంపులకు వెళ్లి అడ్రస్, ఫోన్ నంబర్ వంటి వివరాలతో KYC అప్‌డేట్ చేయించుకోవచ్చు. లేదా మీరే ఆన్‌లైన్‌(మీ బ్యాంక్ వెబ్‌సైట్)లో చేసుకోవచ్చు. 2014లో ఈ స్కీమును ప్రారంభించగా, దేశంలో ప్రస్తుతం 55.9 కోట్ల ఖాతాలున్నాయి.

News August 8, 2025

పార్టీ అభివృద్ధికి మోదీ సూచనలు ఇచ్చారు: మాధవ్

image

AP: ఢిల్లీ పర్యటనకు వెళ్లిన BJP రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రధాని మోదీని కలిశారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులను ఆయనకు వివరించారు. ‘రాష్ట్రంలో పార్టీ అభివృద్ధికి ప్రధాని సలహాలు, సూచనలు ఇచ్చారు. ట్రంప్ టారిఫ్‌ల వల్ల ఆక్వా రైతులు పడుతున్న ఇబ్బందులను ప్రధాని దృష్టికి తీసుకెళ్లా. ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నామని మోదీ బదులిచ్చారు. హర్ ఘర్ తిరంగాను ప్రతి గ్రామంలో నిర్వహిస్తాం’ అని వెల్లడించారు.