News April 5, 2024

సీపీఐ పోటీ చేసే స్థానాలివే

image

AP: సార్వత్రిక ఎన్నికల్లో ఒక లోక్‌సభ, 8 అసెంబ్లీ స్థానాల్లో సీపీఐ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. గుంటూరు లోక్‌సభ స్థానంతో పాటు విశాఖ పశ్చిమ, ఏలూరు, విజయవాడ పశ్చిమ, అనంతపురం, పత్తికొండ, తిరుపతి, రాజంపేట, కమలాపురం నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్, సీపీఐ మధ్య ఈ మేరకు సీట్ల ఒప్పందం కుదిరిందని ఆయన తెలిపారు.

Similar News

News November 2, 2025

మెదక్: 3న విద్యుత్ సమస్యలు చెప్పుకోండి: ఎస్ఈ

image

మెదక్​ జిల్లాలో విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించేందుకు ఈనెల 3న విద్యుత్ వినియోగదారుల దినోత్సవం (కన్సూమర్స్​ డే) నిర్వహిస్తున్నట్లు ఎస్​ఈ నారాయణ నాయక్​ తెలిపారు. మెదక్​ జిల్లాలో రైతులు, గృహావసర విద్యుత్ వినియోగదారులకు ధీర్ఘకాలికంగా విద్యుత్ సమస్యలు ఏమైనా ఉన్నా, మీటర్లు, అధిక బిల్లులు వచ్చినా, రైతులకు ట్రాన్స్​ఫార్మర్లకు కానీ, విద్యుత్ వైర్లకు సంబంధించి నేరుగా వచ్చి చెప్పాలని కోరారు.

News November 2, 2025

క్రమశిక్షణ కమిటీ ముందుకు కొలికపూడి, చిన్ని

image

AP: విజయవాడ MP కేశినేని చిన్ని, తిరువూరు MLA కొలికపూడి శ్రీనివాసరావు మధ్య వివాదంపై TDP క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. సీఎం ఆదేశాలతో వారితో మాట్లాడేందుకు సిద్ధమైంది. ఈ నెల 4న 11AMకు కొలికపూడిని, అదే రోజు 4PMకు చిన్నిని తమ ఎదుట హాజరు కావాలని సమాచారం అందించింది. అనుచరుల హడావుడి లేకుండా ఒంటరిగా రావాలని పేర్కొంది. పార్టీ, సంస్థాగత పదవుల విషయంలో ఇరువురి వివాదం నెలకొన్న విషయం తెలిసిందే.

News November 2, 2025

కరువు మండలాల జాబితా విడుదల

image

AP: 2025 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం కరువు మండలాల జాబితా విడుదల చేసింది. తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా 3 జిల్లాల్లోని 37 మండలాలను ఈ కోవకు చెందినవిగా పేర్కొంటూ రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అన్నమయ్య, సత్యసాయి, ప్రకాశం జిల్లాల్లో 37 మండలాలు కరువు బారిన పడినట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లో ఆ పరిస్థితులు లేవని నివేదికలొచ్చినట్లు పేర్కొంది.