News September 6, 2024
వినేశ్, బజరంగ్ పోటీ చేసే స్థానాలు ఇవే

కాంగ్రెస్లో చేరిన రెజ్లర్ వినేశ్ ఫొగట్ హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో జులానా స్థానం నుంచి పోటీ చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే మరో రెజ్లర్ బజరంగ్ పునియా బాద్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగనున్నట్టు తెలుస్తోంది. జులానా నియోజకవర్గం సంప్రదాయ మల్లయోధులకు పెట్టింది పేరు. బాద్లీ ఢిల్లీ-గురుగ్రామ్కు దగ్గరగా ఉండి అన్ని రంగాల్లో వృద్ధి చెందుతున్న కీలక పట్టణం.
Similar News
News November 22, 2025
కడప జిల్లాలో ఇద్దరు సూసైడ్

పులివెందుల(M) నల్లపురెడ్డి పల్లె చెందిన నగేశ్(39) అనే కూలి శుక్రవారం ఓ చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. మద్యానికి బానిసై, కూలి పనులు లేక పలువురు వద్ద అప్పులు చేశాడు. అవి తీర్చే మార్గంలేక మనస్తాపం చెంది సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కొండాపురంలోని ఓబన్నపేట చెందిన పొట్టి ఓబుల్ రెడ్డి(70) అనే వ్యక్తి కడుపునొప్పి భరించలేక శుక్రవారం ఉరి వేసుకున్నాడు.
News November 22, 2025
బాలికలకు సంతూర్ స్కాలర్షిప్.. రేపే లాస్ట్ డేట్

ఉన్నత విద్య కోర్సులు చదువుతున్న గ్రామీణ పేద విద్యార్థినులకు విప్రో అందించే సంతూర్ ఉమెన్ స్కాలర్షిప్ అప్లై చేసుకోవడానికి రేపే లాస్ట్ డేట్. AP, మహారాష్ట్ర ప్రభుత్వ కళాశాలల్లో చదివిన విద్యార్థినులు అర్హులు. ప్రస్తుతం గ్రాడ్యుయేషన్ మొదటి సంవత్సరం చదువుతూ ఉండాలి. వీరికి 30వేల రూపాయలు అందుతుంది.
వెబ్సైట్: <
News November 22, 2025
రైతులకు గుడ్ న్యూస్.. ఫసల్ బీమా యోజనలో మార్పులు!

PM ఫసల్ బీమా యోజనలో కేంద్రం కీలక మార్పులు చేసింది. ఇకపై జంతువుల దాడి, వరదలు/నీట మునగడం వల్ల పంట నష్టం వాటిల్లితే పరిహారం ఇవ్వనుంది. ఇప్పటిదాకా కరవు, వడగళ్లు, తుఫాన్లు వంటి ప్రకృతి విపత్తులే స్కీమ్లో ఉండేవని, కొత్తగా ఈ రెండింటిని చేర్చామని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ తెలిపారు. రైతుల వినతిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 2026-27 ఖరీఫ్ సీజన్ నుంచి అమలు చేయనున్నట్లు చెప్పారు.


