News March 22, 2025

ఐపీఎల్ ఓపెనింగ్ వేడుకల్లో తారలు వీరే

image

ఈరోజు సాయంత్రం ఆరింటికి IPL ఓపెనింగ్ వేడుకలు ప్రారంభం కానున్నాయి. వీటిలో బాలీవుడ్ తారల ఆటపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. నటీనటులు దిశా పటానీ, శ్రద్ధాకపూర్, వరుణ్ ధావన్ డాన్సులు, శ్రేయా ఘోషల్, అర్జీత్ సింగ్ పాటలు, పంజాబీ ఆర్టిస్ట్ కరణ్ ఔజ్లా ర్యాప్ ఆరంభోత్సవ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణలుగా నిలవనున్నట్లు ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. ఇక 7.30 గంటలకు KKR, RCB మధ్య మ్యాచ్ మొదలుకానుంది.

Similar News

News March 23, 2025

హీరోయిన్‌తో టాలీవుడ్ డైరెక్టర్ డేటింగ్?

image

సినీ పరిశ్రమలో వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్న దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తమిళ హీరోయిన్ బ్రిగిడా సాగాతో డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. తన భార్యతో దూరంగా ఉంటున్న ఆయన ఇటీవల బ్రిగిడకు దగ్గరయ్యారని సినీ వర్గాలంటున్నాయి. ఈ పుకార్లపై వారు స్పందించాల్సి ఉంది. కాగా బ్రిగిడాతో శ్రీకాంత్ పెదకాపు-1 సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీ సమయంలోనే వారి మధ్య స్నేహం చిగురించిందని సమాచారం.

News March 23, 2025

BRS రజతోత్సవ వేడుకలపై నేడు కేటీఆర్ సమీక్ష

image

TG: కరీంనగర్‌లో నేడు జరగనున్న BRS రజతోత్సవ సన్నాహక సమావేశానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఉమ్మడి జిల్లాలోని 13 అసెంబ్లీ స్థానాల నుంచి ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశానికి రానున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ వచ్చే నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలపై సమీక్షించడంతో పాటు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

News March 23, 2025

నేడు, రేపు వర్షాలు

image

తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఛత్తీస్‌గఢ్ నుంచి మహారాష్ట్ర వరకు, అంతర్గత కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు రెండు ద్రోణుల కొనసాగుతున్నాయి. దీంతో తెలంగాణలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశమున్నట్లు తెలిపింది. ఇక ఏపీలో కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో పలు చోట్ల వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసింది.

error: Content is protected !!