News September 23, 2025

డయాబెటిస్ లక్షణాలు ఇవే..

image

*బరువు తగ్గిపోవడం
*కంటిచూపు మందగించడం
*తరచూ పుండ్లు కావడం. గాయాలు, దెబ్బలు త్వరగా మానకపోవడం
*బాగా అలసిపోవడం
*అధికంగా దాహం వేయడం
*ఎక్కువసార్లు మూత్ర విసర్జన
>షుగర్ లెవల్స్ ఎక్కువగా ఉండే ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ తీసుకోవద్దు. కూరగాయాలు, పండ్లు, బీన్స్, ఒమేగా-3 పుష్కలంగా ఉండే చేపలు తినాలి. క్రమం తప్పకుండా వాకింగ్, వ్యాయామం చేయాలని వైద్యులు సూచిస్తున్నారు.
Share It

Similar News

News September 23, 2025

ఇంద్రకీలాద్రిపై కోరినన్ని లడ్డూలు: కలెక్టర్

image

AP: దసరా ఉత్సవాలకు విజయవాడ దుర్గగుడిలో అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ లక్ష్మీశ పేర్కొన్నారు. ప్రసాద తయారీ కేంద్రాలను తనిఖీ చేశారు. ‘భక్తులు కోరినన్ని లడ్డూలను ప్రసాదంగా అందించేందుకు ఏర్పాట్లు చేశాం. 11 రోజులకు 36 లక్షల లడ్డూలు సిద్ధం చేశాం. రైల్వేస్టేషన్, బస్టాండ్ వంటి ప్రాంతాల్లో విక్రయ కేంద్రాలున్నాయి. మూలా నక్షత్రం రోజున ఉచితంగా ప్రసాదం పంపిణీ చేస్తాం’ అని తెలిపారు.

News September 23, 2025

హైకోర్టును ఆశ్రయించిన స్మితా సబర్వాల్

image

TG: ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ హైకోర్టును ఆశ్రయించారు. ‘కాళేశ్వరం’ ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టులో తన పేరును తొలగించాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఆమె సీఎంవో సెక్రటరీగా, నీటిపారుదల శాఖ ఇన్‌ఛార్జి కార్యదర్శిగా పనిచేశారు. గత ఏడాది పీసీ ఘోష్ కమిషన్ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు. ప్రస్తుతం అనారోగ్యం కారణంగా దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు.

News September 23, 2025

విద్యార్థినులకు రూ.30వేల స్కాలర్‌షిప్

image

దేశంలోని బాలికల విద్య కోసం అజీమ్ ప్రేమ్‌జీ ఫౌండేషన్ అందిస్తోన్న స్కాలర్‌షిప్స్‌ను సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి సూచించింది. 15,000 మంది బాలికలకు డిగ్రీ పూర్తయ్యే వరకు ప్రతి ఏడాది రూ.30వేలు అందిస్తారు. ప్రభుత్వ స్కూళ్లు/కాలేజీల్లో 10, 12వ తరగతి పాస్ కావాలి. 2025-26 విద్యా సంవత్సరంలో డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్/MBBS ఫస్టియర్‌లో అడ్మిషన్ పొందాలి. దరఖాస్తుతో పాటు పూర్తి వివరాలకు <>క్లిక్<<>> చేయండి.