News September 21, 2025
‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు అందుకున్న తెలుగువాళ్లు వీరే!

మోహన్‌లాల్‌ను ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు వరించిన నేపథ్యంలో గతంలో ఈ అవార్డు అందుకున్న తెలుగు వారెవరో తెలుసుకుందాం. BN రెడ్డి(1974) దక్షిణాది నుంచి ఈ అవార్డు పొందిన తొలి వ్యక్తిగా నిలిచారు. తర్వాత LV ప్రసాద్(1982), B.నాగిరెడ్డి(1986), ANR(1990), రామానాయుడు(2009), K విశ్వనాథ్(2016) అందుకున్నారు. దక్షిణాదిలో వీరితో పాటు రజినీకాంత్, బాలచందర్, గోపాలకృష్ణన్, శివాజీ గణేషన్, రాజ్‌కుమార్‌కు దక్కింది.
Similar News
News September 21, 2025
APPLY NOW: TRAIలో ఉద్యోగాలు

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (<
News September 21, 2025
ట్రంప్‌ను ఓటర్లు గెలిపించింది ఇందుకే: వైట్‌హౌజ్

ట్రంప్ H-1B వీసా ఫీజును <<17767574>>భారీగా<<>> పెంచడాన్ని వైట్‌హౌజ్ సమర్థిస్తూ ఫ్యాక్ట్‌షీట్ రిలీజ్ చేసింది. ‘2003లో 32% ఉన్న వీసాలు ఇటీవల 65%కు పెరిగాయి. నిరుద్యోగుల సంఖ్య రెట్టింపైంది. ఈ ఏడాది ఓ కంపెనీ 5,189 వీసాలను ఆమోదించి 16వేల మంది US ఉద్యోగులను తొలగించింది. మరో కంపెనీ 2022 నుంచి 25,075 వీసాలను పొంది 27వేల మంది స్థానికులను తీసేసింది. ఓటర్లు ట్రంప్‌ను గెలిపించింది వారికి న్యాయం చేయడానికే’ అని వివరించింది.
News September 21, 2025
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు ప్రభుత్వం వ్యతిరేకం: ఉత్తమ్

TG: కర్ణాటకలోని కృష్ణా నదిపై ఉన్న ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ తెలిపారు. ‘ఈ డ్యాంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. నేను రేపు ఢిల్లీకి వెళ్తా. ఆల్మట్టి ఎత్తు పెంపుపై వ్యతిరేకంగా వాదనలు వినిపిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగింది. దానిపై విచారణ జరుగుతోంది. ఎంతటివారైనా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు.