News July 18, 2024

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే తెలుగు తేజాలు వీరే..

image

పీవీ సింధు – ఉమెన్స్ బ్యాడ్మింటన్ (సింగిల్స్)
సాత్విక్‌రాజ్ రంకిరెడ్డి – మెన్స్ బ్యాడ్మింటన్ (డబుల్స్)
నిఖత్ జరీన్ – ఉమెన్ బాక్సింగ్ (50కేజీ కేటగిరీ)
ఆకుల శ్రీజ – ఉమెన్ టేబుల్ టెన్నిస్
జ్యోతి యర్రాజీ – ఉమెన్స్ 100M హర్డుల్స్
జ్యోతిక శ్రీ దండి – ఉమెన్స్ 4X400M రిలే
ధీరజ్ బొమ్మదేవర – మెన్స్ రికర్వ్ (ఆర్చరీ)

Similar News

News January 29, 2026

కేసీఆర్‌కు సిట్ నోటీసులు.. రేపు 3pmకు విచారణ

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో KCRకు సిట్ నోటీసులిచ్చింది. HYD నందినగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు CRPC 160 కింద మాజీ సీఎం పీఏకు నోటీసులు అందించారు. రేపు 3pmకు విచారణకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. 65సం.లకు పైగా వయస్సు ఉండటంతో స్టేషన్‌కు రావడం తప్పనిసరి కాదని తెలిపారు. PSకు రావాలి అనుకుంటే రావచ్చు, లేదా HYD పరిధిలో ఆయన కోరిన చోట విచారణ చేస్తామని నోటీసుల్లో పేర్కొన్నారు.

News January 29, 2026

ఆవనూనెతో చర్మ సంరక్షణ

image

ఆవనూనె, కొబ్బరి నూనె కలిపి ముఖంపై మృదువుగా మర్దనా చేయాలి. ఇలా చేయడం వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుంది. మొటిమలు రాకుండా ఉంటాయి. చర్మం నిర్జీవంగా కనిపిస్తున్నప్పుడు పావుకప్పు ఆవనూనెలో రెండు చుక్కల రోజ్‌ ఆయిల్‌ని కలపాలి. దీనికి చెంచా బియ్యప్పిండి చేర్చి పేస్ట్‌లా చేయాలి. దీన్ని ఒంటికి రాసుకుని నలుగులా రుద్దుకోవాలి. ఇది సహజమైన స్క్రబ్‌లా పనిచేస్తుంది. మృతకణాలు తొలగి మెరిసే చర్మం మీ సొంతమవుతుంది.

News January 29, 2026

మణిద్వీపం గురించి మీకు తెలుసా?

image

జగన్మాత లలితా త్రిపుర సుందరి దేవి నివసించే ప్రదేశమే మణిద్వీపం. ఇది భౌతిక ప్రపంచానికి అతీతంగా వైకుంఠం, కైలాసం కంటే ఉన్నతమైనదని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారు ఇక్కడ చింతామణి గృహంలో కొలువై ఉండి విశ్వాన్ని పాలిస్తుంటారు. మణిద్వీపం అంటే అమ్మవారు కాదు. అది ఆమె నివాసం ఉండే ద్వీపం. ఇక్కడ అనంత సంపదలు, రత్నాలు, పారిజాత వనాలు ఉంటాయి. మణిదీప వర్ణన చదివితే దారిద్య్రం తొలగి, సకల శుభాలు కలుగుతాయని నమ్మకం.