News January 1, 2025

మీరు పాటించాల్సిన మూడు సూత్రాలివే!

image

చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడకు అన్న మహాత్మ గాంధీ మాటలు గుర్తున్నాయా? ఇప్పుడీ డిజిటల్ యుగంలో వీటి స్థానంలో మరో మూడు చేరాయని నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు. ‘డిజిటల్ యుగంలో పాటించవలసిన మూడు సూత్రాలివే.. మీ OTPని ఇతరులతో పంచుకోవద్దు. వాట్సాప్‌లలో వచ్చే లింక్స్‌ను ఓపెన్ చేయొద్దు. ఫేక్ కాల్స్‌ వినొద్దు’ అని చెప్తున్నారు. ఈమధ్యకాలంలో డిజిటల్ మోసాలు పెరిగిన విషయం తెలిసిందే.

Similar News

News December 21, 2025

కుటుంబ కలహాలతో ఇబ్బంది పడుతున్నారా?

image

అకారణంగా మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయా? భాగస్వామితో మనస్పర్థలున్నాయా? దీనివల్ల ప్రశాంతత కరవవుతోందా? దీనికి గ్రహ గతులు సరిగా లేకపోవడం, వాస్తు దోషాలే కారణమవ్వొచ్చు! దీని నివారణకు రోజూ ఉదయం, సాయంత్రం ఇంట్లో దీపారాధన చేయాలి. సత్యనారాయణ స్వామి వ్రతం శుభాన్నిస్తుంది. సోమవారాలు శివాలయానికి వెళ్లడం మంచిది. అభిషేకంతో అధిక ఫలితముంటుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి, ఇల్లు ఆనందమయంగా మారుతుంది.

News December 21, 2025

నేడే ఫైనల్.. వీళ్లు చెలరేగితే విజయం ఖాయం!

image

అండర్-19 ఆసియా కప్‌ వన్డే టోర్నీ ఆఖరి మజిలీకి చేరుకుంది. టీమ్ ఇండియా యంగ్‌స్టర్స్ నేడు దాయాది దేశంతో తలపడనున్నారు. ఇవాళ సూర్యవంశీ, అభిజ్ఞాన్ కుందు మరోసారి చెలరేగితే భారత్‌కు విజయం సునాయాసం అవుతుంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు టీమ్ ఇండియా అన్ని గ్రూప్ మ్యాచుల్లో గెలిచింది. సెమీస్‌లో అయితే శ్రీలంకపై 8 వికెట్ల తేడాతో ఘన విజయం నమోదు చేసింది. ఇప్పటికే పాక్‌ను ఒకసారి 90 రన్స్ తేడాతో ఓడించింది.

News December 21, 2025

జాగ్రత్త.. వణికించేస్తున్న చలి

image

తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. నిన్న తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో అత్యల్పంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇవాళ ఉ.8.30 గంటల వరకు బయటకు రావొద్దని IMD 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అటు APలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మాడుగులలో నిన్న కనిష్ఠ ఉష్ణోగ్రత 4.7 డిగ్రీలుగా నమోదైంది. అరకులో 5.8, పాడేరులో 6.7, డుంబ్రిగుడలో 9.1గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.