News September 4, 2024
పంజాబ్ వదులుకునే ముగ్గురు స్టార్ ప్లేయర్లు వీరే?

IPL-2025కు జట్టులో భారీ మార్పులు చేయాలని పంజాబ్ కింగ్స్ భావిస్తోంది. ఇందులో భాగంగానే రిటెన్షన్లను ఆ ఫ్రాంచైజీ వ్యతిరేకిస్తోంది. అందరూ వేలంలోకి వస్తే నచ్చిన ప్లేయర్లను కొనాలని ఆ జట్టు యోచిస్తోంది. కాగా శిఖర్ ధవన్ రిటైర్మెంట్ ప్రకటించటంతో వచ్చే IPL ఆడేది అనుమానమే. ఇక ఆ జట్టులో కీలక ప్లేయర్లు జానీ బెయిర్స్టో, లియామ్ లివింగ్స్టన్, హర్షల్ పటేల్ను వదిలేయాలని ఫ్రాంచైజీ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Similar News
News December 5, 2025
శుక్రవారం రోజున ఉప్పు కొంటున్నారా?

ఉప్పు అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. అలాగే శుక్రవారమన్నా అమ్మవారికి ఇష్టమే. అందుకే శుక్రవారం రోజున ఉప్పు కొంటే చేసిన అప్పులు త్వరగా తీరిపోతాయని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి కటాక్షంతో సిరిసంపదలు కలుగుతాయని అంటున్నారు. ‘సంపాదనలో భాగంగా మొదటి ఖర్చును ఉప్పుపైనే పెట్టడం ఎంతో శుభకరం. శుక్రవారం రోజున ఉప్పు కొంటే దారిద్ర్యం తొలగిపోతుంది. మంగళ, శని వారాల్లో ఉప్పు కొనకూడదు’ అని సూచిస్తున్నారు.
News December 5, 2025
నేడు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: ప్రకాశం, శ్రీసత్యసాయి, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఇవాళ అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని APSDMA అంచనా వేసింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వానలు పడేందుకు ఛాన్స్ ఉందని పేర్కొంది. గురువారం 5PM వరకు తిరుపతి(D) చిట్టమూరులో 88.5MM, చింతవరంలో 81MM, నెల్లూరులో 61MM, పాలూరులో 60MM వర్షపాతం నమోదైందని తెలిపింది.
News December 5, 2025
చలికాలం.. నిండా దుప్పటి కప్పుకుంటున్నారా?

చలికాలం కావడంతో కొందరు తల నుంచి కాళ్ల వరకు ఫుల్గా దుప్పటిని కప్పుకొని పడుకుంటారు. ఇలా చేస్తే శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందక రక్తప్రసరణ తగ్గి గుండెపై ప్రభావం పడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జీర్ణక్రియ కూడా మందగిస్తుందట. ‘దుప్పటి ముఖానికి అడ్డుగా ఉంటే CO2 లెవల్స్ పెరిగి మెదడు పనితీరుపై ఎఫెక్ట్ చూపుతుంది. O2, Co2 మార్పిడికి అడ్డంకి ఏర్పడి శ్వాసకోస సమస్యలొస్తాయి’ అని చెబుతున్నారు.


