News March 29, 2025
కొత్త సినిమాల సీక్వెల్స్, ప్రీక్వెల్స్ టైటిల్స్ ఇవే!

ఈవారం 4 సినిమాలు రిలీజవగా వీటి సీక్వెల్స్, ప్రీక్వెల్స్‌ను మేకర్స్ ప్రకటించారు. నిన్న రిలీజైన ‘మ్యాడ్ స్క్వేర్’కు సీక్వెల్ ‘మ్యాడ్ క్యూబ్’ ఉండనుంది. హీరో నితిన్ నటించిన ‘రాబిన్‌హుడ్’ సినిమాకు సీక్వెల్ ‘బ్రదర్హుడ్ ఆఫ్ రాబిన్‌హుడ్’ ఉంటుందని హింట్ ఇచ్చారు. మోహన్‌లాల్ నటించిన ‘L2: ఎంపురాన్’కు కొనసాగింపుగా ‘L3: ది బిగినింగ్’, విక్రమ్ హీరోగా వచ్చిన ‘వీర ధీర శూర’కు ప్రీక్వెల్‌గా పార్ట్-1 రానుంది.
Similar News
News March 31, 2025
రూ.2వేల కోట్ల ఆస్తి పన్ను.. GHMC రికార్డ్

TG: ప్రాపర్టీ ట్యాక్స్ వసూళ్లలో GHMC రికార్డు సృష్టించింది. 2024-25కు గాను రూ.2,012 కోట్లు వసూలైనట్లు అధికారులు తెలిపారు. GHMC చరిత్రలో ఇదే అత్యధికమని పేర్కొన్నారు. వన్ టైమ్ సెటిల్మెంట్ పథకం కింద రూ.465 కోట్లు వసూలైందని చెప్పారు.
News March 31, 2025
హారతి ఇస్తుండగా మంటలు అంటుకొని మాజీ మంత్రికి తీవ్రగాయాలు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత గిరిజా వ్యాస్(78) తీవ్రంగా గాయపడ్డారు. ఇంట్లో హారతి ఇస్తుండగా ఆమె చీరకు నిప్పంటుకుంది. దీంతో గాయాలు కాగా కుటుంబ సభ్యులు ఉదయ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అహ్మదాబాద్‌కు తీసుకెళ్లారు. 1985 నుంచి 1990 వరకు ఆమె రాజస్థాన్ రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా సేవలందించారు.
News March 31, 2025
లోన్ తీసుకునేవారికి ALERT!

రుణాలు తీసుకోవాలనుకునేవారికి అలర్ట్. రేపటి నుంచి కొత్త నిబంధన అమల్లోకి వస్తోంది. బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు వంటివాటిలో మూడింటికి మించి లోన్లు తీసుకోవడం ఇకపై కుదరదు. రుణాల ఎగవేతల్ని కట్టడి చేసేందుకు RBI ఈ నిబంధనను తీసుకొచ్చింది. గత ఏడాది డిసెంబరునాటికి 45 లక్షలమంది 3 కంటే ఎక్కువ సంస్థల్లో రుణాలు తీసుకోవడం గమనార్హం.