News August 24, 2025
ట్యాక్స్ పేయర్స్ అత్యధికంగా ఉన్న టాప్-10 రాష్ట్రాలివే!

ఇన్‌కమ్ ట్యాక్స్ డేటా (FY 2024-25) ప్రకారం దేశంలో అత్యధిక శాతం పన్ను చెల్లింపుదారులున్న (వార్షిక ఆదాయం ₹12L-₹50L) రాష్ట్రాల్లో కర్ణాటక (20.6%) తొలి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా TG(19.8), ఝార్ఖండ్(19.5), TN(18.8), ఢిల్లీ (17.6), పుదుచ్చేరి(17.4), ఒడిశా(16.8), MH(16.2), AP(15.9), ఉత్తరాఖండ్(14.2) ఉన్నాయి. కాగా రిచ్ స్టేట్‌గా పేరొందిన గుజరాత్(7%) ఈ లిస్టులో Top-10లో లేకపోవడం గమనార్హం.
Similar News
News August 24, 2025
బీసీ బిల్లుపై అమిత్‌షాను కలిసిన స్పీకర్

TG: రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బీసీ రిజర్వేషన్ల బిల్లు అంశాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లారు. ఢిల్లీలో జరిగిన స్పీకర్ల సదస్సు సందర్భంగా ఆయనను కలిసి బిల్లు ప్రస్తావన తెచ్చారు. ‘అసెంబ్లీలో ఆమోదించిన బిల్లు ఇంకా కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉంది. దీని గురించి సీఎం రేవంత్ మిమ్మల్ని ప్రత్యేకంగా కలిశారు’ అని గుర్తు చేశారు. ఈ విషయాన్ని పరిశీలిస్తానని అమిత్‌షా బదులిచ్చారు.
News August 24, 2025
రేపు ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో BCలకు 42శాతం రిజర్వేషన్లపై న్యాయ నిపుణులతో భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అలాగే, ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసుల అంశంపైనా చర్చించనున్నట్లు వెల్లడించాయి. అట్నుంచి ఆయన ఎల్లుండి బిహార్ వెళ్లి రాహుల్ గాంధీ పాదయాత్రలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. మరోవైపు రేపు ఉదయం ఓయూలో జరిగే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని తెలుస్తోంది.
News August 24, 2025
మూడు రోజులు భారీ వర్షాలు!

AP: వాయవ్య బంగాళాఖాతంలో ఒడిశా-ప.బెంగాల్‌కు ఆనుకొని రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3రోజులు ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది. మిగిలిన జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఆస్కారముందని తెలిపింది.