News November 21, 2024
ఫస్ట్ టెస్టుకు అంపైర్లు వీళ్లే

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా రేపు భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గఫానీ వ్యవహరిస్తారు. థర్డ్ అంపైర్‌గా ఇల్లింగ్‌వర్త్, ఫోర్త్ అంపైర్‌గా సామ్ నోగాజ్స్కీ బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇదిలా ఉంటే <<12115864>>కెటిల్‌బరో<<>> అంపైరింగ్ చేయనున్నారని తెలియడంతో కొందరు అభిమానులు ‘మన టీమ్ మరింత కష్టపడాల్సిందే’ అని ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
Similar News
News December 1, 2025
ఎన్నికల శిక్షణకు గైర్హాజరు.. అధికారులకు షోకాజ్ నోటీసులు

పంచాయతీ ఎన్నికల శిక్షణకు ముందస్తు సమాచారం లేకుండా హాజరుకాని 10 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఖమ్మం కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఎన్నికల విధులు చాలా కీలకమని, సిబ్బందిని సన్నద్ధం చేసేందుకే శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. వీరిపై ఎందుకు కఠిన చర్యలు తీసుకోకూడదో సమాధానం ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు.
News December 1, 2025
TGకి ఐదేళ్లలో రూ.3.76Lకోట్ల నిధులిచ్చాం: కేంద్రం

తెలంగాణకు గత ఐదేళ్లలో రూ.3,76,175 కోట్ల నిధులు ఇచ్చినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. BJP MP అరవింద్ అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. కేంద్ర పన్నుల్లో వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలు, గ్రాంట్లు, ఫైనాన్స్ కమిషన్ ద్వారా వివిధ పద్ధతుల్లో నిధులు విడుదల చేశామన్నారు. ఐదేళ్లలో రాష్ట్రం నుంచి కేంద్రానికి పన్నుల రాబడి కింద రూ.4,35,919Cr వచ్చాయని తెలిపారు.
News December 1, 2025
వైకుంఠద్వార దర్శనం.. 24 లక్షల మంది రిజిస్ట్రేషన్

AP: తిరుమలలో వైకుంఠ ఏకాదశి తొలి 3 రోజుల(డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనానికి ఈ-డిప్ రిజిస్ట్రేషన్ గడువు ముగిసింది. 1.8 లక్షల టోకెన్ల కోసం 9.6 లక్షల రిజిస్ట్రేషన్ల ద్వారా 24,05,237 మంది భక్తులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ-డిప్లో ఎంపికైన భక్తుల ఫోన్లకు రేపు మెసేజ్ వస్తుంది. ఇక మిగిలిన 7 రోజులకు(జనవరి 2-8) నేరుగా వచ్చే భక్తులకు దర్శనం కల్పిస్తారు.


