News June 5, 2024
కూటమి సునామీలోనూ గెలవలేని దురదృష్టవంతులు వీరే!
AP: కూటమి ప్రభంజనంలోనూ కొందరిని దురదృష్టం వెంటాడింది. ఇంతటి వేవ్‌లోనూ వారు YCP అభ్యర్థులపై ఓటమి చవిచూశారు. వారిలో ఎరిక్షన్ బాబు (Y.పాలెం), గొట్టిపాటి లక్ష్మీ (దర్శి), బీటెక్ రవి (పులివెందుల), రామచంద్రారెడ్డి (పుంగనూరు), జయచంద్రారెడ్డి (తంబళ్లపల్లి), బాలసుబ్రమణ్యం (రాజంపేట), బొజ్జ రోషన్న (బద్వేలు), వీరభద్రగౌడ్ (ఆలూరు), రాఘవేంద్రరెడ్డి (మంత్రాలయం), రాజారావు (అరకు), గిడ్డి ఈశ్వరి (పాడేరు ) ఉన్నారు.
Similar News
News November 28, 2024
బీఆర్ఎస్వీ నాయకుల్ని తక్షణం విడుదల చేయాలి: కేటీఆర్
గురుకుల సమస్యలపై ప్రశ్నించిన బీఆర్ఎస్వీ నేతల్ని అరెస్ట్ చేయడం అప్రజాస్వామికమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR ట్విటర్లో మండిపడ్డారు. ‘ప్రజాపాలనలో ప్రశ్నిస్తే కేసులా? పురుగుల అన్నం పెడుతున్నారని ప్రశ్నిస్తే కేసులు పెడతారా? నిన్న అరెస్ట్ చేసిన మా విద్యార్థి నాయకుల జాడ నేటికీ చెప్పకుండా రాత్రంతా తిప్పుతారా ? వారిని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.
News November 28, 2024
‘బచ్చన్’ లేకుండానే ఐశ్వర్యరాయ్ పేరు
దుబాయ్‌లో జరిగిన ఓ ఈవెంట్లో ఐశ్వర్యరాయ్ పేరు వెనుక బచ్చన్ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. అభిషేక్ బచ్చన్ నుంచి ఆమె విడిపోయారన్న వార్తలకు ఇది మరింత ఊతమిచ్చింది. దుబాయ్‌లో ఇటీవల జరిగిన ప్రపంచ మహిళా సదస్సుకు ఐష్ హాజరయ్యారు. ఆమె పేరును అక్కడి స్క్రీన్‌పై ‘ఐశ్వర్యరాయ్-ఇంటర్నేషనల్ స్టార్’ అని ప్రదర్శించారు. ఐష్‌కి తెలియకుండా ఇది జరగదని, ఆమె భర్త నుంచి విడిపోయారని అభిమానుల మధ్య చర్చ నడుస్తోంది.
News November 28, 2024
రెడ్ అలర్ట్.. అతి భారీ వర్షాలు
ఏపీలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రేపు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీవ్ర వాయుగుండం ఇవాళ సాయంత్రానికి తుఫానుగా మారనుందని పేర్కొంది.