News February 3, 2025
67వ గ్రామీ అవార్డ్స్-2025 విజేతలు వీరే

ఆల్బమ్ ఆఫ్ ది ఇయర్- కౌబాయ్ కార్టర్(బియాన్స్)
సాంగ్ ఆఫ్ ది ఇయర్ – ‘నాట్ లైక్ అస్’ (కేండ్రిక్ లామర్)
బెస్ట్ కంట్రీ ఆల్బమ్- ‘కౌ బాయ్ కార్టర్ (బియాన్స్)
బెస్ట్ అమెరికానా పర్ఫార్మెన్స్ – ‘అమెరికన్ డ్రీమింగ్’ (సియెర్రా ఫెర్రెల్)
బెస్ట్ మెలోడిక్ రాప్ పర్ఫార్మెన్స్ – ‘3’ (రాప్సొడీ ఫీచరింగ్ ఎరికా బాడు)
బెస్ట్ రాక్ ఆల్బమ్ – హాక్నీ డైమండ్స్ (ది రోలింగ్ స్టోన్స్)
Similar News
News March 27, 2026
వెండి తెర ‘శ్రీరాములు’

ఆదర్శ పురుషుడైన శ్రీరాముడి పాత్రను వెండి తెరపై పోషించి పలువురు మెప్పించారు. 1932లో ‘పాదుకా పట్టాభిషేకం’ సినిమాలో తొలిసారి యడవల్లి సూర్యనారాయణ రాముడిగా కనిపించారు. అనేక చిత్రాల్లో NTR రఘురాముడిగా జీవించారు. వీరే కాకుండా CSR ఆంజనేయులు, ANR, హరనాథ్, శోభన్‌బాబు, కాంతారావు, జూ.NTR, సుమన్, శ్రీకాంత్, బాలకృష్ణ, ప్రభాస్ రామయ్య పాత్రలో మెరిశారు. మహేశ్ బాబు, రణ్‌బీర్ కూడా రాముడిగా నటిస్తున్నారు.
News March 27, 2026
భద్రాచలం రాముని విగ్రహం – ఒక అరుదైన రూపం

సాధారణంగా ఏ రామాలయంలోనైనా శ్రీరాముడు విల్లు పట్టుకొని కనిపిస్తారు. కానీ భద్రాచలంలో రామచంద్రమూర్తి చతుర్భుజాలతో దర్శనమిస్తారు. పై రెండు చేతుల్లో శంఖు, చక్రాలు.. కింద రెండు చేతుల్లో ధనుర్భాణాలు ధరించి ఉంటారు. ఇలాంటి విగ్రహం ప్రపంచంలో మరెక్కడా లేదు. ఇది వైకుంఠ రాముని రూపం. సీతమ్మ వారు స్వామివారి ఎడమ తొడపై కూర్చొని ఉంటారు. అందుకే ఈ విగ్రహాన్ని “ఆలింగన మూర్తి”గా కూడా భక్తులు భావిస్తారు.
News March 27, 2026
పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్‌పై శుభవార్త

పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ కోసం దేశ ప్రజలు ఆందోళన చెందవద్దని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ప్రపంచంలో ఏం జరిగినా రాబోయే <<19483054>>60 <<>>రోజులకు దేశంలోని ప్రతి పౌరుడికి సరిపడా పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉందంది. ఆ తర్వాత 2 నెలలకు సరిపడా క్రూడాయిల్ దేశానికి వస్తోందని తెలిపింది. అలాగే US, రష్యా, AUS, ఇతర దేశాల నుంచి 8,00,000 టన్నుల LPG దేశానికి వస్తోందని.. వచ్చే నెల రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది లేదని వివరించింది.


