News March 9, 2025

‘IIFA’ డిజిటల్(ఓటీటీ) అవార్డు విజేతలు వీరే..

image

* బెస్ట్ ఫిలిం- అమర్ సింగ్ చమ్కీలా
* బెస్ట్ ఫీమేల్ లీడింగ్ రోల్- కృతి సనన్(దో పత్తీ)
* బెస్ట్ మేల్ లీడింగ్ రోల్- విక్రాంత్ మాస్సే(సెక్టార్ 36)
* బెస్ట్ డైరెక్టర్- ఇంతియాజ్ అలీ(అమర్ సింగ్ చమ్కీలా)
* బెస్ట్ ఒరిజినల్ స్టోరీ(ఫిలిం)- కనికా ధిల్లాన్(దో పత్తీ)

Similar News

News December 7, 2025

బాలీవుడ్ దర్శకుడు అరెస్ట్

image

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ అరెస్టయ్యారు. బయోపిక్ తీస్తామని రాజస్థాన్ డాక్టర్‌ను రూ.30 కోట్లకు మోసం చేశారనే ఆరోపణలతో విక్రమ్‌తో పాటు ఆయన భార్య శ్వేతాంబరిని పోలీసులు అరెస్ట్ చేశారు. విక్రమ్ కూతురు కృష్ణతో సహా 8 మందిపై FIR నమోదు చేశారు. రేపు విక్రమ్ దంపతులను రిమాండ్‌కు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాజ్, హేట్ స్టోరీ, 1920, ఘోస్ట్, ఫుట్ పాత్ తదితర చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు.

News December 7, 2025

చలికాలంలో ఫ్యాన్ గాలికి పడుకుంటున్నారా?

image

చలికాలంలో ఫ్యాన్ గాలికి పడుకోవడం ఆరోగ్యానికి మేలు కాదని నిపుణులు చెబుతున్నారు. దీని వలన చలి తీవ్రత పెరగడమే కాకుండా గొంతు నొప్పి, శ్వాస సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. చల్లగాలి శరీరాన్ని తాకితే ఉదయం నిద్రలేవగానే కండరాల బలహీనత ఏర్పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. శరీర ఉష్ణోగ్రతను ప్రభావితం చేసి నిద్రకు ఆటంకం కలిగించడమే కాకుండా రోగనిరోధక శక్తిపై ప్రభావితం చూపిస్తుందంటున్నారు.

News December 7, 2025

జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్

image

TG: ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు’ వేడుకల్లో భాగంగా ఎల్లుండి ఉ.10 గంటలకు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్‌‌లోనూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.