News August 12, 2024
‘CAS’ ఎదుట వినేశ్ ఫొగట్ వాదనలు ఇవే!

కేవలం 100 గ్రా. బరువును పరిగణనలోకి తీసుకుని <<13796504>>అనర్హత<<>> వేటు వేయడం సరైంది కాదని CASలో వినేశ్ ఫొగట్ కౌన్సిల్ వాదించింది. ‘అథ్లెట్ మొత్తం బరువులో అది 0.1-0.2% మాత్రమే. దానివల్ల ఎలాంటి అదనపు ప్రయోజనం ఉండదు. ఒకేరోజు మూడు గేమ్స్లో తలపడటంతో అథ్లెట్ ఆరోగ్యం దృష్ట్యా ఆహారాన్ని ఎక్కువ తీసుకోవాల్సి వచ్చింది. బౌట్స్ మధ్య తక్కువ వ్యవధి ఉండడంతో బరువు తగ్గేందుకు ఛాన్స్ లేకుండా పోయింది’ అని వాదించింది.
Similar News
News December 9, 2025
ఎంజీఎంలో టెండర్లు ఉండవా ?

వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో గుత్తేదారులతో హవా నడుస్తోంది. కాల పరిమితి ముగిసినా టెండర్లు పిలవకపోవడంతో పాత కాంట్రాక్టు సంస్థలకే కట్టబెడుతున్నారు. శానిటేషన్ టెండర్ ముగిసినా గత 3 నెలలుగా వారితోనే సిబ్బంది వేతనాలు కోతలతో చెల్లిస్తున్నా అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. స్టేషనరీ, సర్జికల్, మెడికల్ టెండర్లు పిలవకపోవడంతో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపణలు ఉన్నాయి.
News December 9, 2025
క్రికెట్ చరిత్రలో ఒకేఒక్కడు.. రస్సెల్

విండీస్ ఆల్రౌండర్ రస్సెల్ చరిత్ర సృష్టించారు. T20లలో 5000+ రన్స్, 500+ సిక్సులు, 500+ వికెట్లు సాధించిన తొలి ప్లేయర్గా ఘనత సాధించారు. అన్ని దేశాల లీగ్లలో కలిపి రస్సెల్ 576 మ్యాచ్లు ఆడారు. మొత్తంగా 9,496 రన్స్, 972 సిక్సర్లు, 628 ఫోర్లు బాదారు. కాగా వ్యక్తిగతంగా 126 మంది 5000+ రన్స్, ఆరుగురు 500+ వికెట్లు, 10 మంది 500+ సిక్సర్లు బాదారు. కానీ ఇవన్నీ చేసిన ఒకేఒక్కడు రస్సెల్.
News December 9, 2025
డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు: కేటీఆర్

TG: తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు DEC 9 అని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR గుర్తుచేశారు. ‘అమరుల త్యాగం, KCR ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికింది. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్రం ప్రకటించి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29(దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9(విజయ్ దివస్) లేదు. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు. జై తెలంగాణ’ అని ట్వీట్ చేశారు.


