News December 27, 2024

జనవరి 1 నుంచి ఈ మార్పులు

image

గత కొన్ని నెలలుగా స్థిరంగా ఉన్న డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది. కార్ల ధరలు పెంచుతామని ప్రకటించిన పలు కంపెనీలు కొత్త ఏడాది నుంచి వాటిని అమల్లోకి తీసుకురానున్నాయి. దీంతో పాటు NBFC, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల ఫిక్స్‌డ్ డిపాజిట్లలో నిబంధనలతో పాటు GST పోర్టల్‌లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. యూపీఏ 123పే ట్రాన్సాక్షన్ లిమిట్ రూ.5వేల నుంచి రూ.10వేలకు పెరగనుంది.

Similar News

News December 28, 2024

సుమతీ నీతి పద్యం- తాత్పర్యం

image

సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భంగిన్
సిరి తా పోయిన పోవును
కరి మ్రింగిన వెలగపండు కరణిని సుమతీ!
తాత్పర్యం: టెంకాయ లోపలికి నీరు వచ్చినట్లు సంపద తెలియకుండానే వస్తుంది. ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జు మాదిరి సంపద తెలియకుండానే మాయమవుతుంది.

News December 28, 2024

జర్మనీ పార్లమెంట్ రద్దు.. FEB 23న ఎలక్షన్స్

image

జర్మనీ అధ్యక్షుడు ఫ్రాంక్ వాల్టర్ అక్కడి పార్లమెంట్‌ను రద్దు చేశారు. ఫిబ్రవరి 23న ఎన్నికలు నిర్వహిస్తామని అధికారులు ప్రకటించారు. అప్పటి వరకు ఛాన్సలర్ ఓలాఫ్ షోల్జ్ తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఇటీవల జరిగిన ఓటింగ్‌లో అక్కడి సంకీర్ణ ప్రభుత్వం పార్లమెంట్ విశ్వాసాన్ని కోల్పోయింది. 733 మంది సభ్యులున్న సభలో అనుకూలంగా 207, వ్యతిరేకంగా 394 మంది ఓట్లు వేశారు.

News December 28, 2024

రోజా కూతురికి అంతర్జాతీయ అవార్డు

image

AP: మాజీ మంత్రి రోజా కుమార్తె అన్షు మాలికకు సోషల్ ఇంపాక్ట్ గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవార్డు దక్కింది. నైజీరియాలో ఆమె పురస్కారాన్ని అందుకున్నారు. అన్షు 7ఏళ్లకే కోడింగ్ రాశారు. 17ఏళ్లకే ఫేస్ రికగ్నిషన్ బాట్ యూజింగ్ డీప్ లెర్నింగ్‌పై రీసెర్చ్ పేపర్ రాశారు. ఇది ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమైంది. ద ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ పేరిట కవితలు, కథానికలు రాస్తుంటారు. ప్రస్తుతం ఇండియానా వర్సిటీలో చదువుతున్నారు.