News September 13, 2024
వీటికి నెట్‌ఫ్లిక్స్ సపోర్ట్ ఉండదు!

పాత ఐఫోన్, ఐప్యాడ్లకు తమ సపోర్ట్‌ను త్వరలో ఆపేస్తున్నామని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. ఐఓఎస్ 17, ఐప్యాడ్ ఓఎస్ 17 కంటే వెనుకటి ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్న యాపిల్ డివైజ్‌లకు అప్డేట్స్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఐఫోన్ 8, 8 ప్లస్, ఎక్స్, ఐప్యాడ్ ప్రో, 5వ తరం ఐప్యాడ్ పరికరాలపై ఈ నిర్ణయం ప్రభావం ఉంటుంది. ఈ నిర్ణయం ఎప్పటి నుంచి అమలవుతుందన్నదానిపై నెట్‌ఫ్లిక్స్ తుది తేదీని ఇంకా ప్రకటించలేదు.
Similar News
News October 21, 2025
ఆయన భారత్‌ను ఎంచుకున్నారు.. లోకేశ్ ట్వీట్ వైరల్!

AP: వైజాగ్‌లో $15B పెట్టుబడులతో గూగుల్ డేటా-Ai హబ్ ఏర్పాటు చేయనున్న సంగతి తెలిసిందే. దీనిపై తమిళనాడులో అధికార DMK, ప్రతిపక్ష AIADMK మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. గూగుల్‌ను TNకు తీసుకురావడంలో CM స్టాలిన్ ఫెయిలయ్యారని, తమిళుడైన గూగుల్ CEO పిచయ్ APని ఎంచుకున్నారని AIADMK చేసిన వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ స్పందించారు. ‘ఆయన భారత్‌ను ఎంచుకున్నారు’ అంటూ హుందాగా బదులిచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరలవుతోంది.
News October 21, 2025
పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తున్నారా?.. జాగ్రత్త!

పరిమితికి మించి నగదు లావాదేవీలు చేస్తే తిప్పలు తప్పవని ఐటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. లిమిట్ దాటితే IT శాఖ నుంచి నోటీసులొస్తాయని, భారీ ఫైన్లు విధిస్తారని చెబుతున్నారు. ‘₹20 వేలకు మించి నగదును రుణంగా ఇవ్వకూడదు/తీసుకోకూడదు. ఒకేరోజు ₹2 లక్షలు/అంతకంటే ఎక్కువ నగదు తీసుకోడానికి పర్మిషన్ లేదు. వీటిపై 100% పెనాల్టీ విధించే చాన్స్ ఉంది’ అని అంటున్నారు. కొన్ని సందర్భాల్లోనే మినహాయింపు ఉంటుందంటున్నారు.
News October 21, 2025
కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు: సత్యకుమార్ యాదవ్

AP: కిడ్నీ రోగుల కోసం రాష్ట్రంలో కొత్తగా 7 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు. S.కోట, భీమవరం, పీలేరు ఏరియా ఆసుపత్రులలో, సీతంపేట, వెంకటగిరి, అద్దంకి, సున్నిపెంట సీహెచ్‌సీల్లో ఇవి ఏర్పాటవుతాయని వివరించారు. వీటిలో రోజూ 3 సెషన్లలో 15 మంది చొప్పున రోగులకు రక్తశుద్ధి జరుగుతుందన్నారు. PMNDP కింద ఒక్కో కేంద్రంలో ₹75 లక్షలతో యంత్రాలు, పరికరాలు సమకూరుతాయని తెలిపారు.