News December 30, 2024

ఈ అమ్మాయిలు మామూలోళ్లు కాదు..!

image

సౌత్ కొరియా BTS pop బ్యాండ్ అంటే కొందరు అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు. MH ధారావికి చెందిన ముగ్గురు మైనర్ బాలికలు BTS బాయ్స్‌ను కలిసేందుకు ఏకంగా కిడ్నాప్ నాటకం ఆడారు. కిడ్నాప్ అయినట్లు ఓ మహిళతో పోలీసులకు ఫేక్ కాల్ చేయించి దొరికేశారు. తాము పుణేకు వెళ్లి డబ్బు సంపాదించి కొరియాకు వెళ్లేందుకు ప్లాన్ చేశామని విచారణలో వెల్లడించారు. ముగ్గురు బాలికలను (11- 13 ఏళ్లు) పోలీసులు వారి ఫ్యామిలీలకు అప్పగించారు.

Similar News

News November 17, 2025

బాలానగర్‌లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్‌లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

News November 17, 2025

సౌదీ బస్సు ప్రమాదం.. హెల్ప్‌లైన్ ఏర్పాటు

image

సౌదీలో జరిగిన ఘోర బస్సు <<18309348>>ప్రమాదంపై<<>> విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రియాద్‌లోని ఎంబసీ, జెడ్డాలో కాన్సులేట్‌లు బాధిత కుటుంబాలకు అండగా ఉంటాయన్నారు. మరోవైపు కేంద్రం హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఏదైనా సమాచారం కోసం 8002440003, 0122614093, 0126614276, +966556122301 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

News November 17, 2025

పెళ్లిపై రూమర్స్.. అసహ్యమేస్తోందన్న త్రిష

image

తనకు పెళ్లంటూ వస్తున్న రూమర్స్ అసహ్యం కలిగిస్తున్నాయని హీరోయిన్ త్రిష ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మ్యారేజ్, పొలిటికల్ ఎంట్రీపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. ‘నేనెవరితో ఫొటో దిగితే వారితో పెళ్లి అయినట్లేనా? నాకు ఎంత మందితో వివాహం చేస్తారు? ఇలాంటి ప్రచారం ఆపండి’ అని పేర్కొన్నారు. త్రిష ఓ హీరోతో డేట్‌లో ఉందని, చండీగఢ్ బిజినెస్‌మ్యాన్‌ను పెళ్లి చేసుకోబోతున్నారని తరచుగా రూమర్లు పుట్టుకొస్తున్నాయి.