News June 28, 2024
NDA ప్రభుత్వ అవినీతికి ఈ ఘటనలే నిదర్శనం: ఖర్గే

పదేళ్ల NDA పాలనలో అవినీతి, నేరపూరిత నిర్లక్ష్యం కారణంగా నాసిరకం పనులతో మౌలిక వనరులకు నష్టం కలుగుతోందని INC చీఫ్ ఖర్గే విమర్శించారు. ‘ఢిల్లీ విమానాశ్రయ పైకప్పు, జబల్‌పూర్ ఎయిర్‌పోర్టు రూఫ్ కూలిపోయాయి. అయోధ్యలో కొత్త రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. రామ మందిరం లీకేజీ అవుతోంది. బిహార్‌లో 13 బ్రిడ్జిలు కూలిపోయాయి. గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలి ఘోర విషాదం సంభవించింది’ అని Xలో ఫైరయ్యారు.
Similar News
News April 17, 2026
స్విమ్స్‌లో అత్యాధునిక కంటి వైద్య సేవలు

తిరుపతి స్విమ్స్ హాస్పిటల్ కంటి వైద్య విభాగంలో అత్యాధునిక పరీక్షలు, శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని అధికారులు తెలిపారు. కంటి శుక్లం, గ్లాకోమా, రెటినా సమస్యలకు ఫాకో, లేజర్, OCT సేవలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. రోజుకు 150 ఓపీలు, నెలకు 100 ఆపరేషన్లు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. అర్హులకు డా.ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా ఉచిత చికిత్స అందుబాటులో ఉందని తెలిపారు.
News April 17, 2026
‘సూపర్ మారియో’ దుమ్మురేపుతున్నాడు.. 15 రోజుల్లో ₹5వేలకోట్లు!

ఒకప్పుడు వీడియో గేమ్ ప్రపంచాన్ని డామినేట్ చేసిన మారియో గుర్తున్నాడా? ఇప్పుడు ఆ మారియో ప్రపంచ బాక్సాఫీసును రఫ్ఫాడిస్తున్నాడు. ఏప్రిల్ 2న రిలీజైన ‘ది సూపర్ మారియో గెలాక్సీ మూవీ’ ఇప్పటివరకు ఏకంగా 636 మిలియన్ డాలర్ల (₹5,912కోట్లు) గ్రాస్ వసూలు చేసింది. త్వరలో ఇది ఫిబ్రవరిలో రిలీజైన ‘పెగాసస్ 3’ గ్రాస్ ($641 మిలియన్లు) బ్రేక్ చేసి ఈ ఏడాదిలో ఇప్పటివరకు రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలవనుంది.