News June 7, 2024
ఈ MPలు ఒకే సినిమాలో హీరో-హీరోయిన్

NDA కూటమిలో ఇద్దరు MPలు ఒకప్పుడు ఓ సినిమాలో హీరో-హీరోయిన్‌గా చేశారు. ఒకరు తొలిసారి MPగా పోటీ చేసి గెలిచిన కంగనా రనౌత్. మరొకరు లోక్ జనశక్తి చీఫ్ చిరాగ్ పాస్వాన్. 2011లో వచ్చిన ‘మిలే నా మిలే హమ్’లో జంటగా నటించారు. అయితే అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కంగనా సినిమాల్లో సత్తా చాటి రాజకీయాల్లోకి రాగా, పాస్వాన్ ఈ ఎన్నికల్లో తన పార్టీకి 100% <<13389049>>స్ట్రైక్‌రేట్<<>> అందించి సక్సెస్ అందుకున్నారు.
Similar News
News December 22, 2025
రెండో పెళ్లిపై మారుతున్న దృక్పథం

భారతీయుల్లో రెండో పెళ్లిపై అభిప్రాయాలు వేగంగా మారుతున్నాయి. రీబౌన్స్ మ్యాచ్‌మేకింగ్ యాప్ నిర్వహించిన తాజా సర్వేలో విడాకులు తీసుకున్న వారిలో 28% మంది మళ్లీ పెళ్లికి సిద్ధమని వెల్లడించారు. గతం తమ భవిష్యత్తును డిసైడ్ చేయకూడదని వారు భావిస్తున్నారు. ఈ మార్పులో మహిళలే ముందుండటం గమనార్హం. ముఖ్యంగా మెట్రో నగరాల్లో ఈ ఆలోచనా ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. సమాజంలో మారుతున్న ఈ ఆలోచనా విధానంపై మీ Comment?
News December 22, 2025
తండ్రైన భారత క్రికెటర్

టీమ్ ఇండియా క్రికెటర్ శార్దూల్ ఠాకూర్ దంపతులు మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘బేబీ బాయ్‌కి స్వాగతం. 9 నెలలుగా నీ రాక కోసం ఎదురుచూస్తున్నాం’ అంటూ రాసుకొచ్చారు. కాగా 2023 ఫిబ్రవరి 27న మిథాలీ పారూల్కర్‌ను శార్దూల్ పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం జాతీయ జట్టులో చోటు కోల్పోయిన ఆయన దేశవాళీ క్రికెట్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
News December 21, 2025
అల్లుడి చేతిలోకి పార్టీ పోతుందనే భయంతో..: సీఎం

TG: కేసీఆర్ తన కొడుకు కోసమే బయటికి వచ్చారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘కేసీఆర్ చస్తే హరీశ్ రావు పార్టీని తన చేతుల్లోకి తీసుకోవాలని చూస్తున్నారు. అల్లుడి చేతుల్లోకి పార్టీ పోతుందనే భయంతోనే కేసీఆర్ బయటకు వచ్చారు. కేసీఆర్, కేటీఆర్ రాష్ట్రాన్ని ఆర్థికపరంగా అత్యాచారం చేశారు. కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది. అన్ని ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా మార్పు రావడం లేదు’ అని చిట్‌చాట్‌లో విమర్శించారు.


