News September 19, 2024
మీ ఇంట్లో ఫ్రిజ్ శుభ్రం చేయకపోతే మహిళల్లో ఈ సమస్యలు!

మహిళల్లో యూరినరీ సమస్యలు (UTI) ఇంట్లోని ఫ్రిజ్ వల్ల కూడా వచ్చే ప్రమాదం ఉందని US అధ్యయనం అంచనా వేసింది. కుళ్లిన మాంసాన్ని ఫ్రిజ్లో ఉంచడం వల్ల ఎస్చెరిచియా కోలై (E-Coli) అనే బ్యాక్టీరియా ఏర్పడి అది ఇతర పదార్థాలకు వ్యాపించే ప్రమాదం ఉంది. దీంతో UTI సమస్యలు వస్తున్నట్టు అంచనా వేసింది. ఇంట్లోని ఫ్రిజ్ను తరచుగా శుభ్రం చేయడం మహిళల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
Similar News
News December 22, 2025
TETపై సుప్రీంలో ప్రభుత్వం పిటిషన్

AP: టీచర్లందరికీ TET తప్పనిసరి చేస్తూ ఇటీవల SC ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. 2011లో ఈ విధానం వచ్చింది. అయితే SC తీర్పుతో అంతకు ముందు నియమితులైన వారికీ టెట్ తప్పనిసరైంది. వీరు 2 ఏళ్లలో టెట్ ఉత్తీర్ణులు కావాలి. ఎన్నో ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన తాము ఇపుడు టెట్ పాసవ్వాలనడంపై లక్షలాది టీచర్లు ఆందోళనతో ఉన్నారు. దీనిపై వారి వినతితో మినహాయింపు కోసం ఈ పిటిషన్ వేశామని ఓ అధికారి తెలిపారు.
News December 22, 2025
ఏమయ్యా.. నీకు రోజూ అదే పనా?

స్విగ్గీ ఇన్స్టామార్ట్ ఇయర్ ఎండ్ రిపోర్టులో ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. చెన్నైకి చెందిన ఓ వ్యక్తి ఏడాదిలో కండోమ్స్ కోసం ఏకంగా రూ.1.06 లక్షలు ఖర్చు చేసినట్లు వెల్లడించింది. నెలకు సగటున 19 చొప్పున 228 ఆర్డర్లు ఇచ్చాడని తెలిపింది. దీంతో ‘ఏం బాబూ నీకు రోజూ అదే పనా?’ అని నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కాగా తమకు వచ్చే ప్రతి 127 ఆర్డర్లలో ఒకటి కండోమ్ ఆర్డర్ ఉందని సంస్థ చెప్పింది.
News December 22, 2025
ఇంటి వెనుక ఖాళీ స్థలం వదిలితేనే ఆరోగ్యం

ఇంటి వెనుక ఖాళీ స్థలాన్ని కచ్చితంగా వదలాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. తద్వారా గాలి ప్రసరణతో ఇంట్లో ఉక్కపోత, తేమ తగ్గుతాయని అంటున్నారు. ‘సహజ వెలుతురు వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. వాస్తు రీత్యా ఇంటి వెనుక భాగం ఖాళీ ఉంటే కుటుంబంలో ప్రశాంతత, ఆర్థికాభివృద్ధి ఉంటాయి. స్థలం తక్కువని నిర్లక్ష్యం చేయకుండా కొంత వరకైనా ఇంటి వెనకాల స్థలం వదిలాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>


